Honey Trap: పాక్‌కు చేరిన భారత్ అణు రహస్యాలు..? డీఅర్డీఎల్ హనీట్రాప్ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

కంచన్‌బాగ్ డీఅర్డీఎల్ హనీ ట్రాప్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డీఆర్‌డీఎల్‌లో క్వాలిటీ ఇంజనీర్ గా పనిచేస్తున్న మల్లికార్జునరెడ్డిని నటాషా అనే మహిళ ముగ్గులోకి దింపి భారత్ అణు రహస్యాలను తెలుసుకున్నట్లు గుర్తించారు. ఇప్పటికే ఈ విషయంపై మల్లికార్జున్ రెడ్డిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు

Honey Trap: పాక్‌కు చేరిన భారత్ అణు రహస్యాలు..? డీఅర్డీఎల్ హనీట్రాప్ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

Honey Trap

Honey Trap: కంచన్‌బాగ్ డీఅర్డీఎల్ హనీ ట్రాప్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డీఆర్‌డీఎల్‌లో క్వాలిటీ ఇంజనీర్ గా పనిచేస్తున్న మల్లికార్జునరెడ్డిని నటాషా అనే మహిళ ముగ్గులోకి దింపి భారత్ అణు రహస్యాలను తెలుసుకున్నట్లు గుర్తించారు. ఇప్పటికే ఈ విషయంపై మల్లికార్జున్ రెడ్డిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. వారి విచారణలో సంచలన విషయాలు సేకరించారు. ప్రధానంగా.. కె- సీరీస్ మిస్సైల్ కు చెందిన కీలక సమాచారాన్ని నటాషాకు మల్లికార్జునరెడ్డి చేరవేసినట్లు పోలీసులు గుర్తించారు.

Honey trap case: నెట్ బ్యాలెన్స్‌కు డబ్బులు లేవని నమ్మించింది.. రూ.2.50 లక్షలు మాయం చేసింది ..

యుకే అనుబంధ డిఫెన్స్ జర్నలిస్ట్ పేరుతో మల్లిఖార్జున్ ను నటాషా ట్రాప్ చేసింది. అయితే నటాషా నిజంగా జర్నలిస్ట్ కాదని, పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంట్ గా తెలుస్తోంది. రెండు సంవత్సరాలుగా వీరి మధ్య సంభాషణలు కొనసాగుతున్నాయి. అయితే 2019 నుండి 2021 వరకు నటాషా కు మిస్సైల్ కాంపోనెంట్స్ కీలక డేటాను చేరవేసినట్లు, సబ్ మెరైన్ నుండి మిస్సైల్స్ లాంచ్ చేసే కీలక కె-సిరీస్ కోడ్ ను పాకిస్తానీ స్పైకు చేర్చినట్లు తెలిసింది. సిమ్రాన్ చోప్రా, ఒమిషా అడ్డి పేరుతో ఫేస్బుక్ ప్రొఫైల్స్ మెయింటైన్ చేశాడు పాకిస్తానీ. ఫేస్ బుక్ మెసెంజర్ ద్వారా మల్లికార్జున్ కు మెసేజ్ పంపినట్లు పోలీసులు గుర్తించారు.

world’s Biggest Fish: ప్రపంచంలోనే అతిపెద్ద చేప గుర్తింపు.. ఎన్ని కేజీలంటే..

అయితే మల్లికార్జున్ ఫోటోలు, వీడియోలు అడిగినా నటాషా పంపించలేదు. కేవలం చాటింగ్ తోనే మల్లికార్జున్ ను ట్రాప్ చేసింది. ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్ లో మిస్సైల్ కు సంబందించిన కీలక సమాచారంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొబైల్ లో నటాషా వాయిస్ రికార్డింగ్ లు స్వాధీనం చేసుకున్నారు. ఇంగ్లీష్, హిందీ లో నటాషా వాయిస్ క్లిప్పింగ్స్ ఉన్నాయి. ఇప్పటికే మల్లికార్జున్ రెడ్డిని అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు, అతన్ని కస్టడీకి తీసుకోవాలని యోచిస్తున్నారు.