Honey trap case: నెట్ బ్యాలెన్స్‌కు డబ్బులు లేవని నమ్మించింది.. రూ.2.50 లక్షలు మాయం చేసింది ..

ప్రేమ, పెళ్లి, స్నేహం ముసుగులో మాయగాళ్లే కాదు.. కిలేడీలు వలపు వల విసురుతున్నారు. తమ మాటలు నమ్మి దగ్గరైన వారి బలహీనతలను అవకాశంగా చేసుకుని సొమ్ము చేసుకుంటున్నారు. మాయమాటలతో వలపు వలవిసిరి లక్షల్లో కాజేస్తున్నారు. ఇలాంటి ఘటన బాపట్ల జిల్లాలో చోటు చేసుకుంది..

Honey trap case: నెట్ బ్యాలెన్స్‌కు డబ్బులు లేవని నమ్మించింది.. రూ.2.50 లక్షలు మాయం చేసింది ..

Honey Trap Case

Honey trap case: ప్రేమ, పెళ్లి, స్నేహం ముసుగులో మాయగాళ్లే కాదు.. కిలేడీలు వలపు వల విసురుతున్నారు. తమ మాటలు నమ్మి దగ్గరైన వారి బలహీనతలను అవకాశంగా చేసుకుని సొమ్ము చేసుకుంటున్నారు. మాయమాటలతో వలపు వలవిసిరి లక్షల్లో కాజేస్తున్నారు. ఇలాంటి ఘటన బాపట్ల జిల్లాలో చోటు చేసుకుంది. నెట్ బ్యాలెన్స్ అయిపోయింది.. రూ. 20 తన ఖాతాకు పంపించమని చెప్పిన యువతి.. కొద్ది నిమిషాల వ్యవధిలోనే యువకుడి ఖాతాలోనుంచి రూ.2.50 లక్షలు మాయం చేసింది. కళ్లముందే బ్యాంక్ ఖాతాలో లక్షల్లో డబ్బులు పోయినప్పటికీ ఏమీ చేయలేని పరిస్థితి ఆ యువకుడిది.

Soldier Honey-Trap: హనీట్రాప్‌లో సైనికుడు.. పాక్ యువతికి రహస్య సమాచారం చేరవేత

బాపట్ల జిల్లా చీరాల మండలం హస్తినాపురం సమీపంలోని జాంద్రపేటకు చెందిన దేవాన గణేష్ ఉద్యోగరిత్యా ఉంగుటూరు మండలం చేబ్రోలు వచ్చాడు. స్థానికంగా ఓ పరిశ్రమలో సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాడు. కొన్ని రోజుల కిందట ఫేస్ బుక్ ద్వారా ప్రీతి అనే పేరుతో ఓ యువతి పరిచయమైంది. రోజుల పాటు చాటింగ్ లు చేసుకున్న వారి మధ్య చనువు ఏర్పడింది. గణేష్ నుండి ఎలాగైనా డబ్బులు కొట్టేయాలని పథకం పన్నిన యువతి.. వలపు వల విసరసాగింది. కొద్దిరోజుల తరువాత టెలిగ్రామ్ లో ఇద్దరూ సందేశాలు పంపుకున్నారు. వీడియో కాల్ చేసుకుందామని యువతి ఒక లింక్ ను గణేష్ ఫోన్ కు పంపించింది. ఆశతో గణేష్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని ప్రీతితో మాట్లాడటం మొదలు పెట్టాడు.

Honey Trap : హనీట్రాప్‌ వల్లే బీజేపీ నాయకుడి ఆత్మహత్య ?

ఈ నెల 23న ఫోన్ మాట్లాడుకుంటూనే నా నెట్ బ్యాలెన్స్ అయిపోయింది.. నా బ్యాంక్ ఖాతాకు రూ. 20 పంపించాలని యువతి గణేష్ కు సూచించింది. అడిగిందే తడవుగా గణేష్ రూ. 20 ఆమె ఖాతాకు పంపిచాడు. కొద్దిసేపటి తరువాత మీ ఖాతాలో రూ. 2.50లక్షలు వేరే అకౌంట్ కు సెండ్ అయ్యాయని మెస్సేజ్ రావడంతో కంగుతిన్న గణేష్.. బ్యాంకుకు వెళ్లి ఫిర్యాదు చేయగా.. గణేష్ ఖాతాలో నుంచి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ లోని ఓ బ్యాంకు ఖాతాకు బదలీ అయినట్లు బ్యాంక్ అధికారులు గుర్తించారు. అయితే ఖాతాలో రూ.2.50 లక్షలు పోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. నా దగ్గర ఉన్న నీ వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానంటూ యువతి బెదిరించడం గమనార్హం. పోలీసులు గణేష్ నుండి వివరాలు సేకరించి విచారణ చేపట్టారు.