Nirmal : సెప్టెంబర్ 17 నిర్మల్‌‌కు అమిత్ షా..బీజేపీ భారీ బహిరంగసభ

సెప్టెంబర్‌ 17 రావడంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ముందుకెళ్తున్న బీజేపీ.. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అస్త్రంగా మలుచుకుంటోంది.

Nirmal : సెప్టెంబర్ 17 నిర్మల్‌‌కు అమిత్ షా..బీజేపీ భారీ బహిరంగసభ

Nirmal Bjp

Amit Shah Nirmal : సెప్టెంబర్‌ 17 రావడంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ముందుకెళ్తున్న బీజేపీ.. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అస్త్రంగా మలుచుకుంటోంది. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్న  కమలనాథులు….. ఈ సారి మాత్రం భారీగా ప్లాన్‌ చేశారు. 2021, సెప్టెంబర్ 17వ తేదీ శుక్రవారం ప్రతిష్టాత్మక బహిరంగ సభకు సిద్ధమయ్యారు. నిర్మల్‌లోని వెయ్యి ఉరుల మర్రి వేదికగా భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు.  ఈ సభకు  కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను రప్పిస్తున్నారు.

Read More : మద్యం షాపుల్లో రిజర్వేషన్లు – తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు

కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటనకు సకల ఏర్పాట్లు చేశారు బీజేపీ నేతలు. వెయ్యి ఉరుల మర్రి దగ్గర గల పోరాట యోధుల స్మారక స్తూపానికి అమిత్‌షా నివాళులు అర్పించనున్నారు. ఆ తర్వాత ఎల్లపెల్లి సమీపంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఇందుకోసం బీజేపీ శ్రేణులు పది రోజుల నుంచే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు దాదాపు లక్ష మందిని సమీకరిస్తున్నారు. నిర్మల్‌లో ప్రధాన కూడళ్లు, అన్ని మార్గాలు కాషాయమయమయ్యాయి. అమిత్‌షాకు స్వాగతం పలుకుతూ భారీగా ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల 40 నిమిషాలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరనున్న

Read More : రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకలు.. పలువురు ప్రముఖులకు ఆహ్వానం

అమిత్‌షా పదకొండున్నరకు నాందేడ్‌ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొని.. మధ్యాహ్నం 1.50కి హెలికాప్టర్‌లో తెలంగాణకు బయలుదేరుతారు. మధ్యాహ్నం 2.30కు నిర్మల్‌కు ఆయన చేరుకుంటారు.  2.45కు నిర్మల్‌ సభా ప్రాంగణంలో మోదీ జన్మదినం సందర్భంగా బీజేపీ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని సందర్శిస్తారు. అనంతరం గోండు పోరాట యోధుడు రాంజీ గోండ్‌ విగ్రహానికి నివాళులు అర్పిస్తారు.  మధ్యాహ్నం 3.15 నుంచి 4.50 వరకు నిర్మల్‌  సభలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం  5గంటలకు తిరుగుపయనం అవుతారు.

Read More : Harassment : బాలుడిపై లైంగిక దాడి.. ఆయాకు 20ఏళ్ల జైలు శిక్ష

బహిరంగ సభకు భారీ జనసమీకరణ కోసం పార్టీ రాష్ట్ర నాయకత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. పార్టీ రాష్ట్ర ఇంచార్జీ తరుణ్‌చుగ్‌ స్వయంగా ముఖ్యనేతలతోపాటు జిల్లాల అధ్యక్షులతో సమావేశాలు నిర్వహించారు.  మరోవైపు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సైతం.. అన్ని జిల్లాలు, మండలాల అధ్యక్షులతో టెలీకాన్ఫరెన్స్ లు నిర్వహించి జనసమీకరణ ప్రతిష్టాతక్మకంగా తీసుకోవాలని సూచించారు. బండి సంజయ్‌ నిర్వహిస్తున్న పాదయాత్రకు శుక్రవారం బ్రేక్‌ పడనుంది. నిర్మల్‌ బహిరంగ సభలో పాల్గొనేందుకు బండి సంజయ్‌ వెళ్లనున్నారు. అంతకుముందు ఆయన ఎల్లారెడ్డిలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. నిర్మల్‌లో సభ అనంతరం తిరిగి పాదయాత్ర మళ్లీ ప్రారంభించనున్నారు.