Hollywood Sequel : హాలీవుడ్ సినిమాలకు సీక్వెల్ రెడీ..

కరోనా సెకండ్ వేవ్ తగ్గడంతో హాలీవుడ్‌లో షూటింగ్స్ ఇప్పుడిప్పుడే స్టార్టవుతున్నాయి.. క్రేజీగా తెరకెక్కుతున్న స్టార్ మూవీ సీక్వెల్స్ రిలీజ్ కోసం హాలీవుడ్ రెడీ అవుతోంది..

Hollywood Sequel : హాలీవుడ్ సినిమాలకు సీక్వెల్ రెడీ..

Sequel Movie Shoot Starts In Hollywood

Hollywood Sequel: కరోనా సెకండ్ వేవ్ తగ్గడంతో హాలీవుడ్‌లో షూటింగ్స్ ఇప్పుడిప్పుడే స్టార్టవుతున్నాయి. క్రేజీగా తెరకెక్కుతున్న స్టార్ మూవీ సీక్వెల్స్ రిలీజ్ కోసం హాలీవుడ్ రెడీ అవుతోంది. మరి అప్‌కమింగ్ క్రేజీ సీక్వెల్ మూవీస్ ఏంటో లెట్స్ హ్యావ్ ఎ లుక్.

హాలీవుడ్‌లో షూటింగ్స్ స్పీడప్ అవుతున్నాయి. ప్రస్తుతం హాలీవుడ్‌లో సీక్వెల్ సినిమాలదే హవా నడుస్తోంది. సూపర్ హిట్ సినిమాలకు సీక్వెల్స్‌ని రిలీజ్ చేసే పనిలో బిజీగా ఉన్నారు మేకర్స్. అమెరికన్ అడ్వెంచరస్ కామెడీ యాక్షన్ సిరీస్ ‘ఇండియానా జోన్స్’ ఫస్ట్ సిరీస్ రిలీజ్ అయ్యి దాదాపు 40 సంవత్సరాలు కావస్తోంది. స్టీఫెన్ స్పీల్ బర్గ్ డైరెక్షన్‌లో ఇంట్రెస్టింగ్ ఫిక్షనల్ ఆర్కియాలజీ కంటెంట్‌తో ఇప్పటి వరకూ నాలుగే సిరీస్‌లు వచ్చినా.. ప్రతి సిరీస్ సూపర్ డూపర్ హిట్ అయ్యి నెక్ట్స్ సిరీస్ కోసం ఆడియన్స్‌ని వెయిట్ చేసేలా చేసింది ఈ క్రేజీ సిరీస్. కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత షూటింగ్ మొన్నీమధ్యనే స్టార్ట్ చేసిన ఈ సినిమా ఫుల్ స్వింగ్‌లో షూటింగ్ జరుపుకుంటోంది.

స్టీఫెన్ స్పీల్ బర్గ్ ఫస్ట్ నాలుగు సిరీస్‌లు డైరెక్ట్ చేస్తే.. లాస్ట్ సిరీస్‌ని మాత్రం జేమ్స్ మ్యాన్ గోల్డ్ డైరెక్ట్ చేస్తున్నారు. క్రేజీ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఈ మోస్ట్ హిలేరియస్ కామెడీ అడ్వెంచరస్ సినిమా జులై 29, 2022 న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ క్రేజీ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.

ఇండియానా జోన్స్‌తో పాటు హాలీవుడ్‌లో చాలా సినిమాలకు సీక్వెల్స్ త్వరలోనే ఆడియెన్స్ ముందకు రాబోతున్నాయి. ఎంటర్‌టైన్‌మెంట్ చరిత్రలో ఇప్పుడు ఎలక్ట్రిఫైయింగ్ యాక్షన్ సీన్స్‌తో హాలీవుడ్ మోస్ట్ ఎంటర్‌టైనింగ్ సిరీస్ ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’. ఈ సినిమాకి సంబంధించి నైన్త్ మూవీ ఇప్పుడు జూన్ 25న రిలీజ్‌కు రెడీ అవుతోంది.

1996 లో స్టార్ట్ అయిన ఈ ‘మిషన్ ఇంపాజిబుల్’ సిరీస్‌ను దాదాపు 25 ఏళ్లుగా సూపర్ హిట్ చేస్తూ.. స్టార్ హీరోగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు టామ్ క్రూజ్. ‘మిషన్ ఇంపాజిబుల్’ ఫ్రాంచైజ్‌లో వచ్చిన అన్ని సిరీస్‌లు సూపర్ హిట్ అయ్యాయి. ‘మిషన్ ఇంపాజిబుల్’ సిరీస్‌లో 7, 8 సినిమాల్ని బ్యాక్ టు బ్యాక్ తెరకెక్కిస్తున్న టీమ్.. సెవెన్త్ సిరీస్‌గా వస్తున్న ‘టాప్ గన్ మెవరిక్’ ని నవంబర్ 19, 2021 లో రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేస్తున్నారు.

హాలీవుడ్‌లో మరో మోస్ట్ ఇంట్రెస్టింగ్ సిరీస్ ‘అవతార్’ కు సంబంధించి రెండు సీక్వెల్స్ రెడీ అవుతున్నాయి. ‘అవతార్ 2’ ఇప్పటికే షూటింగ్ 100 పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ పార్ట్‌లోనే అద్భుతమైన విజువల్స్‌తో పాటు.. ఊహకు కూడా అందని గ్రాఫిక్స్‌ని చూపించిన జేమ్స్.. ‘అవతార్’ సీక్వెల్స్‌లో అంతకుమించి విజువల్ వండర్స్ చూపించబోతున్నారు. ‘అవతార్ 2’ డిసెంబర్ 16 2022, ‘అవతార్ 3’ డిసెంబర్ 20, 2024 లో రిలీజ్ అవుతోంది.

2021 లో హాలీవుడ్‌లో మోస్ట్ ఇంట్రస్టింగ్ మూవీగా వస్తున్న సినిమా ‘జేమ్స్ బాండ్’. డేనియల్‌ క్రెగ్‌ హీరోగా వస్తున్న ‘నో టైమ్ టు డై’ సినిమా.. జేమ్స్ బాండ్ సిరీస్‌లో 25వ సినిమాగా వస్తోంది. ఈ సినిమాని మెట్రో గోల్డెన్‌ మేయర్‌, ఇయోన్ ప్రొడక్షన్స్‌ సంస్థలు కలిసి దాదాపు 2 వేల కోట్ల బడ్జెట్‌తో జోజీ ఫకునగా ఎలక్ట్రిఫైయింగ్ యాక్షన్ సీన్స్‌తో తెరకెక్కించారు. వరల్డ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘నో టైమ్ టు డై’ సినిమా సెప్టెంబర్ 30 ,2021 లో రిలీజ్ కాబోతోంది.

పెద్దా, చిన్నా అన్న తేడా లేకుండా అందరినీ ఎంటర్‌టైన్ చేసిన ‘స్పైడర్ మ్యాన్’ సిరీస్‌లో థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ ‘నో వే హోమ్’ సిరీస్ సినిమా డిసెంబర్ 17, 2021 న రిలీజ్ కాబోతోంది. వీటితో పాటు అమెరికన్ సూపర్ హీరో బేస్డ్ మూవీ ‘ది వెనమ్’ కి సీక్వెల్ కూడా సెప్టెంబర్‌లో రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాలే కాకుండా అమెరికన్ అమేజింగ్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ సిరీస్ ‘మ్యాట్రిక్స్’ లో ఫోర్త్ సిరీస్ ఎలక్ట్రిఫైయింగ్ యాక్షన్‌తో డిసెంబర్ 22, 2021 క్రిస్మస్ ఫీస్ట్‌గా ఆడియెన్స్‌ని ఎంటర్‌టైన్ చెయ్యబోతోంది.