Shaakuntalam: వైరల్ అవుతోన్న శాకుంతలం ఓటీటీ న్యూస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

టాలీవుడ్‌లో ప్రెస్టీజియస్ మూవీగా తెరకెక్కిన మైథలాజికల్ ఎపిక్ మూవీ ‘శాకుంతలం’ రిలీజ్ రోజున మిక్సిడ్ టాక్‌ను సొంతం చేసుకుంది.

Shaakuntalam: వైరల్ అవుతోన్న శాకుంతలం ఓటీటీ న్యూస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Shaakuntalam OTT Release Date News Goes Viral

Shaakuntalam: టాలీవుడ్‌లో ప్రెస్టీజియస్ మూవీగా తెరకెక్కిన మైథలాజికల్ ఎపిక్ మూవీ ‘శాకుంతలం’ ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు గుణశేఖర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించగా, ఈ సినిమాలో స్టార్ బ్యూటీ సమంత లీడ్ రోల్‌లో నటించింది. ఇక ఈ సినిమా టీజర్, ట్రైలర్లు ఈ మూవీపై అంచనాలను అమాంతం పెంచేశాయి. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు.

Shaakuntalam : శ్రీవారి సేవలో శాకుంతలం టీం..

అయితే, ఈ సినిమాకు రిలీజ్ రోజున మిక్సిడ్ టాక్ రావడంతో, ఈ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కాగా, ఈ సినిమాకు సంబంధించి తాజాగా నెట్టింట ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యిందని.. త్వరలోనే ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారని తెలుస్తోంది. శాకుంతలం ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ భారీ రేటుకు సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమాను మే మొదటి వారంలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లుగా తెలుస్తోంది.

Shaakuntalam: సెన్సార్ పూర్తి చేసుకున్న శాకుంతలం.. రన్‌టైమ్ ఎంతో తెలుసా?

దీంతో ఒక భారీ సినిమా ఇలా రిలీజ్ అయిన అతి తక్కువ సమయానికే ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వస్తుందనే వార్త నెట్టింట జోరుగా చక్కర్లు కొడుతోంది. ఇక శకుంతల పాత్రలో సమంత నటించగా, దుష్యంతుడి పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ నటించాడు. మోహన్ బాబు, మధుబాల, అనన్య నాగళ్ల ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు.