Pushpa Step: బంగ్లాదేశ్ లీగ్‌లో పుష్ప స్టెప్పేసిన షకీబ్

తెలుగు డ్యాన్స్ స్టెప్పులు, డైలాగులు ఇమిటేట్ చేసే క్రికెటర్ల మాదిరిగా మైదానంలోనే షకీబ్ పుష్ప స్టెప్పు వేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

Pushpa Step: బంగ్లాదేశ్ లీగ్‌లో పుష్ప స్టెప్పేసిన షకీబ్

Shakib Al Hasan

Updated On : January 27, 2022 / 9:59 PM IST

Pushpa Step: బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ కూడా డేవిడ్ వార్నర్, సురేశ్ రైనాల జాబితాలో చేరిపోయడు. తెలుగు డ్యాన్స్ స్టెప్పులు, డైలాగులు ఇమిటేట్ చేసే క్రికెటర్ల మాదిరిగా మైదానంలోనే షకీబ్ పుష్ప స్టెప్పు వేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. పుష్ప ద రైజ్ తో హిట్ కొట్టిన అల్లు అర్జున్ సూపర్ హిట్ స్టెప్పును వికెట్ పడగొట్టిన వెంటనే చేసి చూపించాడు.

బంగ్లాదేశ్ దేశీ వాలీ లీగ్ అయినటువంటి బంగ్లాదేశీ ప్రీమియర్ లీగ్ లో కొమిలా విక్టోరియన్స్ వర్సెస్ ఫార్చూన్ బరిషల్ మ్యాచ్ లో భాగంగా డుప్లెసిస్ వికెట్ పడగొట్టాడు. ఆరో ఓవర్లో క్యాచ్ ఇచ్చి వికెట్ కోల్పోవడంతో డుప్లెసిస్ నిరాశపడుతుండగా షకీబ్ .. బన్నీ మూమెంట్ ఇమిటేట్ చేస్తూ గడ్డం కింద నుంచి చేయి దీసి తగ్గేదేలే.. ఫోజిచ్చాడు.

ఆశ్చర్యంగా అదే మ్యాచ్ లో డేన్ బ్రావో, నజ్ముల్ ఇస్లామ్ లు కూడా అల్లు అర్జున్ స్టెప్పులు వేసి చూపించారు. బ్రావో వికెట్ పడగొట్టి పుష్ప వాక్ చేసి సెలబ్రేట్ చేసుకున్నాడు.

 

 

Read Also : ఇన్ స్టాగ్రాం ద్వారా భార్యకు ట్రిపుల్ తలాక్!