RC15: ఫస్ట్ లుక్‌కి కూడా గ్రాండ్ ఈవెంట్.. శంకరా మజాకా..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు శంకర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుండగా, ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ విషయంలో చిత్ర యూనిట్ భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

RC15: ఫస్ట్ లుక్‌కి కూడా గ్రాండ్ ఈవెంట్.. శంకరా మజాకా..!

Shankar Plans A Grand Event For Rc15 First Look Launch

RC15: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీని తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాను పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో చరణ్ రెండు వైవిధ్యమైన పాత్రల్లో కనిపిస్తాడని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సగానికిపైగా పూర్తయినట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

RC15: పొలిటికల్ సాంగ్ అందుకుంటున్న చరణ్..?

అయితే ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. ఈ సినిమాలో ప్రతి అంశం అత్యంత గ్రాండియర్‌గా ఉండేలా చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. కాగా, ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్‌కు దర్శకుడు శంకర్ భారీగానే ప్లాన్ చేస్తున్నట్లు చిత్ర వర్గాలు చెబతున్నాయి. ఈ సినిమాలోని చరణ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఓ గ్రాండ్ ఈవెంట్ నిర్వహించి, లాంఛ్ చేయాలని శంకర్ భావిస్తున్నాడట. ఈ సినిమాలో చరణ్ పాత్ర ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉంటుందని, అందుకే ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్‌తో ఈ సినిమాపై మరింత హైప్ తీసుకురావాలని శంకర్ అండ్ టీమ్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆగస్టు 15న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

RC15: చరణ్ ఎంట్రీకే రూ.10 కోట్లు పెట్టిస్తున్న శంకర్..?

ఇక ఈ సినిమాలో చరణ్ సరసన అందాల భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోండగా, ఈ సినిమాలో భారీ తారాగణం నటిస్తోంది. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా, ఈ సినిమాను వచ్చే మార్చిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. మరి ఆగస్టు 15న నిజంగానే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేస్తుందా.. నిజంగానే ఫస్ట్ లుక్ రిలీజ్‌కు గ్రాండ్ ఈవెంట్‌ను శంకర్ ప్లాన్ చేస్తాడా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.