Shanmukh – Deepthi : సిరితో క్లోజ్‌గా ఉండటం వల్లే దీప్తితో బ్రేకప్.. షణ్ముఖ్ సంచలన వ్యాఖ్యలు..

దీప్తితో బ్రేకప్ గురించి షన్ను మాట్లాడుతూ.. ''హౌస్‌లో ఉన్నప్పుడు సిరితో చనువుగా ఉండటమే నెటిజన్లలో నాపై వ్యతిరేకత పెరగడానికి కారణం అనుకుంటున్నాను. అప్పటికే నేను దీప్తితో............

Shanmukh – Deepthi :  సిరితో క్లోజ్‌గా ఉండటం వల్లే దీప్తితో బ్రేకప్.. షణ్ముఖ్ సంచలన వ్యాఖ్యలు..

Shannu Deepthi

Shanmukh – Deepthi :   సోషల్ మీడియా స్టార్, యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ బిగ్ బాస్ సీజన్ 5 లో పాల్గొని రన్నరప్ గా నిలిచాడు. షణ్ముఖ్ బిగ్ బాస్ హౌస్ లో సిరితో క్లోజ్ గా ఉన్న సంగతి తెలిసిందే. వీళ్లిద్దరి మధ్య రొమాన్స్ కూడా జరిగింది. సిరి, షన్ను ఈ షో తో బాగా వైరల్ అయ్యారు. అయితే షన్ను అప్పటికే దీప్తితో, సిరి శ్రీహన్ తో లవ్ లో ఉన్నారు. అయితే బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చాక దీప్తి షణ్ణుకి బ్రేకప్ చెప్పడంతో వీరు ఇద్దరూ వార్తల్లో నిలిచారు.

షన్ను, దీప్తి ఇద్దరూ అయిదు సంవత్సరాలుగా రిలేషన్ లో ఉన్నారు. ఒకరికి ఒకరు అన్ని రెక్కలుగా సపోర్ట్ చేసుకున్నారు. కానీ సడెన్ గా బ్రేకప్ చెప్పడంతో చాలా మందికి కొత్త ప్రశ్నలు తలెత్తాయి. అయితే బిగ్ బాస్ హౌస్ లో సిరితో క్లోజ్ గా ఉండటం వల్లే వీరిద్దరూ విడిపోయారని వార్తలు వచ్చాయి. అయితే సిరి ఈ వార్తలని కొట్టి పడేసింది. దీప్తి కానీ షన్ను కానీ ఇప్పటి వరకు వీరి బ్రేకప్ కి రీజన్స్ చెప్పలేదు. తాజాగా వ్యాలెంటైన్స్ డే సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో షన్ను దీప్తి బ్రేకప్ గురించి ఓపెన్ అయ్యాడు. అంతేకాక మరిన్ని ఆసక్తి కార విషయాలని ఈ ఇంటర్వ్యూలో తెలియచేసాడు.

DJ Tillu : ‘డీజే టిల్లు’ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్

దీప్తితో బ్రేకప్ గురించి షన్ను మాట్లాడుతూ.. ”హౌస్‌లో ఉన్నప్పుడు సిరితో చనువుగా ఉండటమే నెటిజన్లలో నాపై వ్యతిరేకత పెరగడానికి కారణం అనుకుంటున్నాను. అప్పటికే నేను దీప్తితో, సిరి శ్రీహాన్‌తో రిలేషన్‌లో ఉన్నాం. హౌస్‌లో ఉన్నప్పుడు మేమిద్దరం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. దాంతో ఒకరికి ఒకరు తోడుగా, సపోర్ట్ గా ఉండే ప్రాసెస్ లో మా ఇద్దరి మధ్య కాస్త చనువు పెరిగింది. దాంతో అందరిలో వ్యతిరేకత మొదలైంది.’’

Aamani : ఆ డైరెక్టర్స్ సినిమాల్లో నటించాలనుంది

‘‘దీప్తి నేనూ విడిపోవడానికి చాలా కారణాలున్నాయి. నా వల్ల దీప్తి ఎంతో నెగెటివిటీ చూసింది. నెటిజన్లు నన్ను ట్రోల్‌ చేస్తున్నప్పుడు తను నాకే సపోర్ట్‌ చేసింది. సిరితో నేను చనువుగా ఉండటం బయటవాళ్లకు ఎలా నచ్చలేదో, అలాగే దీప్తి కుటుంబానికి కూడా నచ్చలేదు. సిరితో నేను క్లోజ్ గా ఉండటం వల్ల నా విషయంలో అందరి నుంచి దీప్తికి ఒత్తిడి పెరిగింది. ఇకనైనా తను సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతోనే మేము బ్రేకప్‌ చెప్పుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతానికి మేమిద్దరం కెరీర్‌పై దృష్టి పెట్టాం. మేమిద్దరం మళ్లీ కలుస్తామా? లేదా? అనేది తెలీదు. అంతా ఆ దేవుడి చేతుల్లో ఉంది. విధి మా జీవితాల్లో ఏది రాస్తే అదే జరుగుతుందని నమ్ముతున్నాను. మా బ్రేకప్‌కి సిరిని నిందించడం సరి కాదు. తప్పు నాదే కాబట్టి నన్నే నిందించాలి’’ అని షణ్ముఖ్‌ ఎమోషనల్ గా ఫీల్ అయ్యాడు.