Shannu Deepthi : దీప్తి ఫోన్ లో షన్ను నెంబర్ ఏ పేరుతో సేవ్ చేసిందో తెలుసా??

దీప్తి సునయన, షణ్ముఖ్ లవ్ స్టోరీ గురించి అందరికీ తెలుసు. వీళ్ళు డైరెక్ట్ గా చెప్పకపోయినా వీళ్ళని చూసే వాళ్ళకి అర్ధమవుతుంది. ఇండైరెక్ట్ గా చాలా సార్లు చెప్పారు. ఈ మధ్యే షన్ను

Shannu Deepthi : దీప్తి ఫోన్ లో షన్ను నెంబర్ ఏ పేరుతో సేవ్ చేసిందో తెలుసా??

Deepthi

Shannu Deepthi :  దీప్తి సునయన, షణ్ముఖ్ లవ్ స్టోరీ గురించి అందరికీ తెలుసు. వీళ్ళు డైరెక్ట్ గా చెప్పకపోయినా వీళ్ళని చూసే వాళ్ళకి అర్ధమవుతుంది. ఇండైరెక్ట్ గా చాలా సార్లు చెప్పారు. ఈ మధ్యే షన్ను బిగ్ బాస్ ఇంట్లో అందరి ముందు దీప్తి గర్ల్ ఫ్రెండ్ అని చెప్పాడు. బిగ్ బాస్ లో తన దిండు మీద కూడా దీప్తి గురించి రాసుకున్నాడు. అంతకుముందు షన్ను, దీప్తిలు వాళ్ళ టాటూల గురించి కూడా చెప్పారు. ఇద్దరూ కలిపి ఒకే టాటూ వచ్చేలా వేయించుకున్నారు. ఇక బిగ్ బాస్ రెండో సీజన్ లో దీప్తి సునయన కూడా షన్ను గురించి చెప్పింది. ఇక వీళ్ళిద్దరూ కలిసి పార్టీలు, ఔటింగ్స్ చేస్తూ ఉంటారు. ఆ ఫొటోలన్నీ దీప్తి ఎక్కువగా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.

Samantha : సమంత విడాకుల తర్వాత అనౌన్స్ చేసిన మొదటి సినిమా.. గట్టిగానే ప్లాన్ చేసింది

ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే దీప్తి తాజాగా అభిమానులతో ముచ్చటించింది. ఇన్ స్టా స్టోరీలో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్స్ పెట్టింది. అందులో అభిమానులు అడిగేవాటికి సమాధానాలు చెప్పింది. ఎక్కువ మంది షన్ను గురించే అడిగారు. ఇందులో ఓ నెటిజన్ షన్ను కాంటాక్ట్‌ను ఏ పేరుతో సేవ్ చేసుకున్నావ్ అని అడిగాడు. దానికి సమాధానంగా షన్ను వాట్సప్ చాట్‌ ని స్క్రీన్ షాట్‌ తీసి పెట్టింది. అందులో ‘ecstasy’ అని సేవ్ చేసుకుంది. ఇది ఒక డ్రగ్ నేమ్. ఇలా డ్రగ్ నేమ్ తో సేవ్ చేసుకుందేంటి అని కొంతమంది అనుకుంటుంటే, కొంతమంది షన్ను తనకి డ్రగ్ లాంటి వాడు అని అంటున్నారు. ఏదైతే ఏముంది వాళ్లిద్దరూ చెప్పకపోయినా ఇద్దరి ప్రేమ వ్యవహారం మెల్లి మెల్లిగా బయటకి వస్తుంది. వాళ్ళు అధికారికంగా ఎప్పుడు చెప్తారా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.