Sharwanand : సాయి పల్లవితో గుడికి వెళదామంటే చాలు వచ్చేస్తుంది.. ఇద్దరం కలిసి చాలా గుళ్ళకి వెళ్ళాం..

న్ని ప్రశ్నలు అడుగుతూ వాటికి ఏ హీరోయిన్ ని సెలెక్ట్ చేసుకుంటారు అని కాసేపు ఈ యువ హీరోలతో ఆడుకున్నారు బాలయ్య. ఇందులో భాగంగానే సాయి పల్లవి, రష్మిక పేరు చెప్పి వీళ్ళలో బయటకి తీసుకెళ్లాలనుకుంటే డేట్ కి..............

Sharwanand : సాయి పల్లవితో గుడికి వెళదామంటే చాలు వచ్చేస్తుంది.. ఇద్దరం కలిసి చాలా గుళ్ళకి వెళ్ళాం..

Sharwanand spoke about sai pallavi in Unstoppable show

Sharwanand :  బాలయ్య బాబు హోస్ట్ గా చేస్తున్న అన్‌స్టాపబుల్ రెండో సీజన్ గ్రాండ్ గా కొనసాగుతోంది. ఇప్పటికే రెండు ఎపిసోడ్లు పూర్తి అయ్యాయి. వీటికి భారీగా స్పందన వచ్చింది. మొదటి ఎపిసోడ్ లో చంద్రబాబు, లోకేష్ రాగా రెండో ఎపిసోడ్ లో సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ వచ్చి హంగామా చేశారు. మూడో ఎపిసోడ్ లో యువ హీరోలు శర్వానంద్, అడివి శేష్ అన్‌స్టాపబుల్ షోకి వచ్చి సందడి చేశారు.

ఈ ఎపిసోడ్ ఆద్యంతం ఫుల్ ఫన్ గా సాగింది. ఈ ఎపిసోడ్ లో హీరోయిన్స్ గురించి మాట్లాడారు బాలయ్య. కొన్ని ప్రశ్నలు అడుగుతూ వాటికి ఏ హీరోయిన్ ని సెలెక్ట్ చేసుకుంటారు అని కాసేపు ఈ యువ హీరోలతో ఆడుకున్నారు బాలయ్య. ఇందులో భాగంగానే సాయి పల్లవి, రష్మిక పేరు చెప్పి వీళ్ళలో బయటకి తీసుకెళ్లాలనుకుంటే డేట్ కి ఏమని చెప్పి తీసుకెళ్తారు? ఎవరిని తీసుకెళ్తారు అని అడిగారు బాలయ్య.

Sharwanand : ఫ్లైట్‌లోంచి దూకేశాను.. చేతికి రెండు ప్లేట్స్, కాలికి ఒక ప్లేట్ పడ్డాయి.. రెండున్నరేళ్లు పట్టింది కోలుకోవడానికి..

శర్వానంద్ వెంటనే సాయి పల్లవి పేరు చెప్పాడు. సాయి పల్లవితో గుడికి వెళదాం అంటే ఏమి అడగకుండా వచ్చేస్తుంది. ఇద్దరం కలిసి చాలా గుళ్ళకి వెళ్ళాము అని చెప్పాడు. అలాగే అడివి శేష్ కూడా సాయి పల్లవి పేరు చెప్పాడు. సాయి పల్లవికి మంచి పొయెట్రీ ఇష్టం. మంచి పొయెట్రీ చెప్పి ఈజీగా బయటకి తీసుకెళ్లొచ్చు అని అన్నాడు. దీంతో బాలయ్య హిందీలో ఓ పొయెట్రీ చెప్పి నేను చెప్పానని సాయి పల్లవికి చెప్పు అన్నాడు.