Shavukaru Janaki : 90 ఏళ్ళ వయసులో అలనాటి అందాల తార ‘షావుకారు జానకి’కి పద్మశ్రీ

'షావుకారు' సినిమాతో అప్పట్లో భారీ విజయాన్ని సాధించి ఆ సినిమానే ఇంటిపేరుగా మార్చుకొని ఎన్నో సినిమాలని అందించిన షావుకారు జానకి కి కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డు దక్కింది.

Shavukaru Janaki : 90 ఏళ్ళ వయసులో అలనాటి అందాల తార ‘షావుకారు జానకి’కి పద్మశ్రీ

Shavukaru Janaki

Shavukaru Janaki :  ‘షావుకారు’ సినిమాతో అప్పట్లో భారీ విజయాన్ని సాధించి ఆ సినిమానే ఇంటిపేరుగా మార్చుకొని ఎన్నో సినిమాలని అందించిన షావుకారు జానకి కి కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డు దక్కింది. 90 ఏళ్ళ వ‌య‌సులో ఈ అవార్డు దక్కడం గమనార్హం. 70 సంవ‌త్సరాలకు పైగా న‌ట‌నా జీవితం గ‌డిపిన షావుకారు జాన‌కి కి ఇన్నాళ్ళకు ప‌ద్మశ్రీ‌ పుర‌స్కారం ల‌భించ‌డం ఆమె కుటుంబ సభ్యులు, అభిమానులు, సినీ ప్రముఖులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న జాన‌కి ఇప్పటికీ ఎంతో హుషారుగా ఉన్నారు.

14 ఏళ్ళ వ‌య‌సుకే ఆమెకు వివాహం అయినా.. వివాహం తర్వాత నుంచే ఆమె రేడియో నాట‌కాల్లోనూ, రంగ‌స్థలం మీద ప‌లు ప్రదర్శనలు ఇచ్చారు. విజ‌యా సంస్థను నెల‌కొల్పి నాగిరెడ్డి, చక్రపాణి త‌మ తొలి ప్రయత్నంగా ఎల్.వి.ప్రసాద్‌ దర్శకత్వంలో షావుకారు చిత్రాన్ని నిర్మించారు. అందులో జాన‌కిని కథానాయికగా తీసుకున్నారు. య‌న్టీఆర్ హీరోగా విడుద‌లైన తొలి చిత్రం షావుకారు. య‌న్టీఆర్ తొలి నాయిక‌గా షావుకారు జాన‌కి నిల‌చిపోయారు. షావుకారు సినిమా మంచి విజయం సాధించడంతో ఆ సినిమా పేరే ఆమె ఇంటి పేరుగా మారింది.

Rashmika Mandanna : బాలీవుడ్ లో బంపర్‌ఆఫర్ కొట్టేసిన రష్మిక.. విజయ్ దేవరకొండ వల్లేనా??

తెలుగుతో పాటు త‌మిళ‌,క‌న్నడ భాషల్లో కూడా ఎన్నో సినిమాల్లో నటించారు జానకి. ఎన్టీఆర్, ఏఎన్నార్ సరసన ఎన్నో హిట్ సినిమాలలో జోడిగా నటించారు. తమిళ్ లో కూడా శివాజీ గ‌ణేశ‌న్, ఎమ్జీఆర్, జెమినీ గ‌ణేశ‌న్ స‌ర‌స‌న నాయిక‌గా నటించారు. వయసు మళ్ళిన తర్వాత కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ ఎన్నో సినిమాల్లో నటించారు షావుకారు జానకి. ఇప్పటికి కూడా 90 ఏళ్ళ వయసులోనూ తన దగ్గరికి పాత్రలు వస్తే చేస్తున్నారు. ఇన్నేళ్లకైనా ఈమెకు పద్మశ్రీ వరించినందుకు ఆనందం వ్యక్తం చేస్తూ సిఫారసు చేసిన త‌మిళ‌నాడు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు అభిమానులు.