Frog Meat : బాబోయ్.. కప్పను కూర వండుకుని తిన్న కుటుంబం, ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం

కప్పను కూర వండుకుని తిన్న ఓ కుటుంబంలో ఘోరం జరిగిపోయింది. కప్ప కూర తిన్న బాలిక చనిపోయింది. మరో బాలిక పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన ఒడిశా రాష్ట్రం కియోంజర్ జిల్లాలో జరిగింది.

Frog Meat : బాబోయ్.. కప్పను కూర వండుకుని తిన్న కుటుంబం, ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం

Frog Meat : చికెన్, మటన్ తినే వాళ్లే కాదు కుక్కలు, కప్పలు, పాములూ తినే వాళ్లూ ఉన్నారనే విషయం తెలిసిందే. చైనా సహా పలు దేశాల్లో ఇది చాలా కామన్. కాదేదీ తినడానికి అనర్హం అన్నట్టు అన్ని రకాల జీవులను అక్కడ లొట్టలేసుకుని మరీ తినేస్తుంటారు. మన భారత్ లోనూ కొన్ని ప్రాంతాల్లో కప్పలు, పాములు తినే వాళ్లు ఉన్నారు. ఈ విధంగానే కప్పను కూర వండుకుని తిన్న ఓ కుటుంబంలో ఘోరం జరిగిపోయింది. కప్ప కూర తిన్న బాలిక చనిపోయింది. మరో బాలిక పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన ఒడిశా రాష్ట్రం కియోంజర్ జిల్లాలో జరిగింది.

బేమ్ బరి ప్రాంతానికి చెందిన మున్నా ముండా(40) అనే గిరిజనుడి ఇంట్లోకి కప్ప వచ్చింది. మున్నా దాన్ని కూర చేశాడు. ఆ కూరను మున్నా కుటుంబసభ్యులు అంతా తిన్నారు. ఆ తర్వాత ఎవరూ ఊహించని ఘోరం జరిగింది. కప్ప కూర తిన్న మున్నా కూతురు ఆరేళ్ల సుమిత్రా ముండా అస్వస్థతకు గురై మరణించింది. మరో కూతురు మేఘా (4) తీవ్ర అస్వస్థతకు గురైంది. వెంటనే మేఘాను కియోంజర్ లోని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మేఘా పరిస్థితి విషమంగా ఉన్నట్టు డాక్టర్లు చెప్పారు.

Also Read..Chicken Prices : బాబోయ్.. కేజీ చికెన్ 720 రూపాయలు, భగ్గుమన్న కోడి ధర

కాగా, కప్ప కూర తిన్న పెద్దలకు ఏమీ కాకపోవడం విశేషం. వారు ఆరోగ్యంగానే ఉన్నారు. కాగా, పిల్లలు మాత్రం వాంతులు చేసుకున్నారు. వికారంతో బాధపడ్డారు. ఆ తర్వాత స్పృహ తప్పి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. గురువారం రాత్రి వీరంతా కప్ప కూర తిన్నారు. శుక్రవారం సుమిత్రా చనిపోయింది. దీనిపై అధికారులు స్పందించారు. పిల్లలకు రోగనిరోధక శక్తి తక్కువ కావడంతో దుష్ప్రభావం చూపిందని వివరించారు.

Also Read..Fish Curry : చేపల కూర తిన్నతరువాత పాలు తాగుతున్నారా! అయితే ప్రమాదంలో పడ్డట్టే?

కొన్ని రకాల కప్పల్లో శత్రువుల నుంచి కాపాడుకోవడానికి విషం ఉంటుందని అధికారులు తెలిపారు. మున్నా కుటుంబం అలాంటి కప్పనే వండుకుని ఉంటుందని వారు అంచనా వేశారు. కప్పల చర్మపై విష గ్రంధులు ఉంటాయని, అలాంటి వాటిని తిండే విషం ప్రభావం చూపుతుందని, గిరిజనులు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరించారు. కొన్ని రకాల కప్పల చర్మాలు కూడా విషాన్ని కలిగుంటాయన్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. అసహజ మరణంగా పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. పోస్టుమార్టం తర్వాత సుమిత్రా మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. మొత్తంగా కప్ప కూర తిని ఓ బాలిక చనిపోవడం స్థానికంగా కలకలం రేపింది. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.