Fish Curry : చేపల కూర తిన్నతరువాత పాలు తాగుతున్నారా! అయితే ప్రమాదంలో పడ్డట్టే?

చేపలు శరీరానికి వేడిని కలిగిస్తాయి. పాలు, చేపలు రెండింటినీ ఒక దాని వెంట ఒక తీసుకుంటే దాంతో శరీరంలో రియాక్షన్ కలుగుతుంది. దీని వల్ల రక్తం ఇన్‌ఫెక్షన్‌కు గురై చర్మ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి.

Fish Curry : చేపల కూర తిన్నతరువాత పాలు తాగుతున్నారా! అయితే ప్రమాదంలో పడ్డట్టే?

Fish, Milk

Fish Curry : పాలు తాగిన తరువాత కొన్ని పదార్థాలు తీసుకోవటం ప్రమాదకరమని చాలా మంది చెబుతుంటారు. ముఖ్యంగా చేపలు తిన్న వెంటనే పాలు తీసుకోవద్దని పదేపదే సూచిస్తుండటాన్ని గమనించవచ్చు. అలాగే చేపలతో పెరుగు తినడం కూడా హానికరమని చెప్పేవారు లేకపోలేదు. పాలు, చేపలు. ఇవి రెండూ మనకు మంచి పౌష్టికాహారంగా ఉన్నాయి. పాలతో కొన్ని రకాల ఆహారాలు, పానీయాలను నివారించాలని ఆయుర్వేదం చెబుతుంది. అలా తీసుకోవటం వల్ల గ్యాస్ట్రిక్ స‌మ‌స్య‌లు వచ్చే అవకాశం ఉంటుంది.

చేపలు తిన్నతరువాత పాలు తాగటం వల్ల కొంతమందిలో ల్యూకోడెర్మా అనే అనారోగ్య స్థితి రావచ్చని చెబుతున్నారు. చర్మంపై తెల్లటి మచ్చలు వంటివి వచ్చే ప్రమాదం ఉంటుంది. చేప‌లు అసిడిక్ స్వ‌భావాన్ని, పాలు ఆల్క‌లైన్ స్వ‌భావాన్ని క‌లిగి ఉంటాయి. ఈ రెండింటినీ క‌లిపి తీసుకుంటే సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుందట.

చేపలు శరీరానికి వేడిని కలిగిస్తాయి. పాలు, చేపలు రెండింటినీ ఒక దాని వెంట ఒక తీసుకుంటే దాంతో శరీరంలో రియాక్షన్ కలుగుతుంది. దీని వల్ల రక్తం ఇన్‌ఫెక్షన్‌కు గురై చర్మ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ పరిస్ధితి అందరిలో ఉండదు. కొంత మందిలో మాత్రమే ఉండే అవకాశం ఉంటుంది. చేపలు మాత్రమే కాదు, చికెన్, మటన్ తిన్నాక కూడా పాలను తాగకూడదని చెబుతారు.

చేపలను ఆహారంగా తీసుకోవటం వల్ల శరీరానికి అధిక మొత్తంలో ప్రొటీన్ అందుతుంది. దీనితో పాలు కూడా కలిస్తే జీర్ణం అయ్యేందుకు చాలా సమయం పడుతుంది. దీని వల్ల గ్యాస్, అజీర్తి వస్తాయి. ఇక గుండె జబ్బులున్న వారు ఇలా తినడం ఏమాత్రం మంచిది కాదని చెబుతున్నారు.