Chicken Prices : బాబోయ్.. కేజీ చికెన్ 720 రూపాయలు, భగ్గుమన్న కోడి ధర

కోడి ధర భారీగా పెరిగిపోయింది. చికెన్ ధరలు భగ్గుమన్నాయి. కేజీ చికెన్ ధర ఏకంగా రూ.720కి చేరింది. ఏంటి షాక్ అయ్యారు కదూ.. కానీ, ఇది నిజమే.

Chicken Prices : బాబోయ్.. కేజీ చికెన్ 720 రూపాయలు, భగ్గుమన్న కోడి ధర

Updated On : February 13, 2023 / 12:47 AM IST

Chicken Prices : కొంతమందికి కోడి కూర అంటే చాలా ఇష్టం. కోడి కూర లేనిదే ముద్ద దిగదు. ఇక స్పెషల్ డేస్ లో అయితే కచ్చితంగా చికెన్ టేస్ట్ చేయాల్సిందే. అలాంటి చికెన్ ప్రియులకు ఇది షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే కోడి ధర భారీగా పెరిగిపోయింది. చికెన్ ధరలు భగ్గుమన్నాయి. కోడి ధర చుక్కలను తాకింది.

Also Read..Pakistan Crisis : పతనం అంచున పాకిస్తాన్.. కేవలం 18రోజులకు సరిపడ విదేశీ మారకపు నిల్వలు

కేజీ చికెన్ ధర ఏకంగా రూ.720కి చేరింది. ఏంటి షాక్ అయ్యారు కదూ.. కానీ, ఇది నిజమే. చికెన్ ధరలు మండిపోతున్నాయి. అయితే, కంగారు పడాల్సిన పని లేదు. ఎందుకంటే ఇది మన దేశంలో కాదు. పొరుగున ఉన్న పాకిస్తాన్ లో.

పక్క దేశం పాకిస్తాన్ లో చికెన్ ధరలు ఆకాశాన్నంటాయి. కరాచీ, రావల్పిండి, ఇస్లామాబాద్ లలో కిలో చికెన్ ధర రూ.720కి చేరింది. అక్కడ కోడికి ఈ స్థాయి ధర పలకడం ఇదే తొలిసారి. రికార్డు స్థాయిలో పెరిగిన చికెన్ ధర స్థానికులను బెంబేలెత్తిస్తోంది.

Also Read..Indians At Dubai : దుబాయ్‌‌లో భారీ సంఖ్యలో ఇళ్లు కొనేస్తున్న భారతీయులు

చికెన్ ధరలు భగ్గుమనడానికి కారణాలు లేకపోలేదు. పౌల్ట్రీ వ్యాపారాలు మూతపడటమే చికెన్ ధర పెరగడానికి కారణమట. కోళ్ల ఫీడ్ కు కొరత ఏర్పడి పౌల్ట్రీ వ్యాపారులు బిజినెస్ నిలిపివేశారని పాక్ మీడియా తెలిపింది. ఈ స్థాయిలో ధరలు పెరగడంపై చికెన్ ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.