Srisailam : శ్రీశైలంలో కొనసాగుతున్న శ్రావణ మాస పూజలు

ప్రముఖ పుణ్యక్షేత్రంలో ఒకటైన శ్రీశైలం శ్రీశైల భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి వార్ల దేవస్థానంలో శ్రావణ మాస పూజలు కొనసాగుతున్నాయి.

Srisailam : శ్రీశైలంలో కొనసాగుతున్న శ్రావణ మాస పూజలు

Srisailam

Updated On : August 25, 2021 / 6:08 AM IST

Shravan poojas : ప్రముఖ పుణ్యక్షేత్రంలో ఒకటైన శ్రీశైలం శ్రీశైల భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి వార్ల దేవస్థానంలో శ్రావణ మాస పూజలు కొనసాగుతున్నాయి. లోక క్షేమాన్ని కాంక్షిస్తూ…2021, ఆగస్టు 24వ తేదీ మంగళవారం పరివార దేవుళ్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ విషయాన్ని ఆలయ ఈవో కెఎస్ రామారావు వెల్లడించారు. కుమార స్వామికి ఉదయం షోడషోపచార పూజాది క్రతువులు నిర్వహించారు. శివభక్త గణాలకు అధిపతి అయిన వీరభద్రునికి సాయంకాలం ప్రదోషకాల పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు ఈవో వెల్లడించారు.

అదే రోజు సాయంత్రం వీరశిరోమండపం వద్ద కొలువైన శనగలబసవన్నకు ప్రత్యేక పూజాది క్రతువులు నిర్వహించారు ఆలయ అర్చకులు. కరోనా కారణంగా తలెత్తున్న ఇబ్బందులు తొలగిపోవాలని వేదపండితులు, అర్చకులు మహాసంకల్పాన్ని పఠించారు. మల్లికాగుండంలోని శుద్ధజలంతో అభిషేకం నిర్వహించారు.