Shubman Gill: శుభ్‌మ‌న్ గిల్ కు చాన్స్ ఉంది.. ప్లేఆఫ్ లో ఎలా ఆడతాడో..!

యువ బ్యాటర్, గుజరాత్ టైటాన్స్ ఆటగాడు శుభ్‌మ‌న్ గిల్.. తాజా ఐపీఎల్ అరుదైన మైలురాయిని చేరుకునేందుకు దూసుకుపోతున్నాడు.

Shubman Gill: శుభ్‌మ‌న్ గిల్ కు చాన్స్ ఉంది.. ప్లేఆఫ్ లో ఎలా ఆడతాడో..!

శుభ్‌మ‌న్ గిల్ (Photo @ShubmanGill)

Shubman Gill – Orange Cap : యువ బ్యాటర్, గుజరాత్ టైటాన్స్ ఆటగాడు శుభ్‌మ‌న్ గిల్ తనదైన ఆటతీరుతో ఆకట్టుకుంటున్నాడు. ఫర్ ఫెక్ట్ బ్యాటింగ్ తో తాజా ఐపీఎల్ సీజన్ (IPL 2023) లో తనదైన ముద్ర వేశాడు. లీగ్ మ్యాచ్ ల్లో పరుగుల వరద పారించి ఆరంజ్ క్యాప్ సొంతం చేసుకునే దిశగా దూసుకెళ్తున్నాడు. నిలకడగా రాణిస్తూ పరుగులు రాబట్టడమే కాకుండా సీనియర్ల ప్రశంసలు సైతం అందుకుంటున్నాడు. టీమిండియా(team india) లో అతడి మంచి భవిష్యత్తు ఉంటుందని మాజీ క్రికెటర్లు అంచనా వేస్తున్నారు.

2 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు
గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న శుభ్‌మ‌న్ గిల్ ఈ ఐపీఎల్ లో ఇప్పటివరకు 14 మ్యాచ్ లు ఆడి 680 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 152.46 స్టైక్ రేటు, 56.67 సగటుతో ఇప్పటివరకు అతడి బ్యాటింగ్ సాగింది. 67 ఫోర్లు, 22 సిక్సర్లు బాదాడు. బెంగళూరు రాయల్ చాలెంజర్స్ కెప్టెన్ ఫాఫ్ డూ ప్లెసిస్ (Faf du Plessis) మాత్రమే గిల్ కంటే ముందున్నాడు. 730 పరుగులతో అతడు ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు.

మరో 51 పరుగులు చేస్తే..
శుభ్‌మ‌న్ గిల్ ఆరెంజ్ క్యాప్ సాధించే అవకాశాలు ఉన్నాయని క్రికెట్ అభిమానులు అంచనా వేస్తున్నారు. పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ లో ఉన్న గుజరాత్ ప్లేఆఫ్ లో కనీసం రెండు మ్యాచ్ లు ఆడే ఛాన్స్ ఉంది. గిల్ ప్రస్తుత ఫామ్ చూస్తుంటే అతడు ఆరెంజ్ క్యాప్ దక్కించుకునే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని అంటున్నారు. మరో 51 పరుగులు చేస్తే డూప్లెసిస్ ను అధిగమిస్తాడు. దీంతో మిగతా మ్యాచ్ ల్లో అతడు ఎలా ఆడతాడోనని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

Also Read: ఆర్‌సీబీ ఓట‌మికి ఆమెకు ఏమి సంబంధం..? గిల్ సోద‌రిని తిట్టిపోస్తున్న ఫ్యాన్స్‌..!

టాప్-10లో ముగ్గురు
ప్లేఆఫ్ చేరిన చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లలో ముగ్గురు ఆటగాళ్లు టాప్-10లో ఉన్నారు. డెవన్ కాన్వే(585), సూర్యకుమార్ యాదవ్(511), రుతురాజ్ గైక్వాడ్(474) అనూహ్యంగా రాణిస్తే ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. 2021 సీజన్ లో 635 పరుగులతో రుతురాజ్.. ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్న సంగతి క్రికెట్ అభిమాకులను గుర్తుండే ఉంటుంది. 2022లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్(863)కు ఆరెంజ్ క్యాప్ దక్కింది. ఇక ఈ సీజన్ లో ఆరెంజ్ క్యాప్ ఎవరి సొంతం అవుతుందో వేచి చూడాలి.