Karnataka: కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేస్తారు: కేసీ వేణుగోపాల్ అధికారిక ప్రకటన

కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య పేరును ప్రకటించే అవకాశం ఉన్నట్లు మొదటి నుంచి ప్రచారం జరిగింది. చివరికి అదే జరిగింది.

Karnataka: కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేస్తారు: కేసీ వేణుగోపాల్ అధికారిక ప్రకటన

Karnataka

Siddaramaiah: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేస్తారని కాంగ్రెస్ (Congress) నేత కేసీ వేణుగోపాల్ అధికారికంగా ప్రకటన చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ… డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ (DK Shivakumar) పేరును ప్రకటిస్తున్నట్లు చెప్పారు.

డీకే శివకుమార్ వచ్చే పార్లమెంటరీ ఎన్నికలు ముగిసే వరకు కర్ణాటక పీసీసీగానూ కొనసాగుతారని చెప్పారు. సీఎం, డిప్యూటీ సీఎం, ఇతర మంత్రుల ప్రమాణ స్వీకారం ఈ నెల 20న ఉంటుందని ప్రకటించారు. కర్ణాటక విజయం కాంగ్రెస్ కు ఉత్సాహాన్ని ఇచ్చిందని తెలిపారు. కర్ణాటక సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి దేశంలోని పలు పార్టీల నేతలను ఆహ్వానిస్తామని చెప్పారు.

కాగా, కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య పేరును ప్రకటించే అవకాశం ఉన్నట్లు మొదటి నుంచి ప్రచారం జరిగింది. చివరికి అదే జరిగింది. సిద్ధరామయ్య పేరునే పరిశీలకులు కాంగ్రెస్ అధిష్ఠానానికి సూచించారు. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేల అభిప్రాయాలను ఏఐసీసీ పరిశీలకుల బృందం తీసుకుంది. మెజార్టీ ఎమ్మెల్యేలు సిద్ధరామయ్య వైపే మొగ్గు చూపినట్లు సమాచారం.

డీకే శివ కుమార్ తో కాంగ్రెస్ అధిష్ఠానం సంప్రదింపులు జరిపి ఆయనను ఒప్పించింది. డీకే శివకుమార్ కి డిప్యూటీ సీఎం సహా కీలక శాఖలు, కాంగ్రెస్ లోనూ కీలక బాధ్యతలు ఇచ్చే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్ఠానం ఉందని కూడా మొదటి నుంచి ప్రచారం జరిగింది.

Telangana Cabinet : నేడే సచివాలయంలో తొలి కేబినెట్ మీటింగ్