Khalistan Row: ఇక చాలు.. పంజాబ్ పోలీసులకు వార్నింగ్ ఇచ్చిన సిక్కు సంఘాలు

వేర్పాటువాద నాయకుడు అమృత్‌పాల్ సింగ్‌ను అరెస్టు చేసేందుకు కేంద్రం, రాష్ట్రాలు కలిసి పనిచేస్తున్న తరుణంలో మత గురువు ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఖలిస్తానీ నాయకుడు ఇప్పటికీ పరారీలో ఉన్నారు. అయితే అతని మద్దతుదారులలో 78 మందిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు

Khalistan Row: ఇక చాలు.. పంజాబ్ పోలీసులకు వార్నింగ్ ఇచ్చిన సిక్కు సంఘాలు

Sikh Body's Warning As Cops Look For Separatist

Khalistan Row: అమృతపాల్ సింగ్ కారణంగా ఖలిస్తానీ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. పంజాబ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే అమృతపాల్ సింగ్ అనుచరులను పలువుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు, అమృతపాల్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. రాష్ట్రంలో హైఅలర్ట్ ప్రకటించారు. మొబైల్ ఇంటర్నెట్ సేవల్ని రద్దు చేశారు. సరిహద్దులో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో పోలీసు వాహనాల సైరన్లు మోత మోగుతున్నాయి. అనుమానంగా ఎవరు కనిపించినా ప్రశ్నలు ఎదుర్కొంటున్నట్లు సమాచారం.

KA Paul: బిల్‌గేట్స్‌ను చంద్రబాబుకు పరిచయం చేసింది నేనే.. కుటుంబ పాలన పోవాలంటే ప్రజాశాంతి పార్టీ రావాలి: కేఏ పాల్

అయితే పంజాబ్‌కు గతంలో తీవ్ర గాయాలయ్యాయని, మళ్లీ మళ్లీ గాయాలు చేయొద్దని సిక్కు సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. గతంలో అయిన గాయాలకే ఏ ప్రభత్వమూ మందు రాసే ప్రయత్నం చేయలేదని, వాటి సెగ ఇంకా కొనసాగుతూనే ఉందని, ఇప్పుడు మళ్లీ దాన్ని మరింత ఝటిలం చేయొద్దని అంటున్నారు. రాష్ట్రంలో భయానక వాతావరణాన్ని సృష్టించకుండా ఉండాలని ప్రభుత్వాన్ని ఒక సిక్కు సంఘ మత గురువు (జతేదార్ చీఫ్) అకల్ తఖ్త్ జతేదార్ గియానీ హర్‌ప్రీత్ సింగ్ కోరారు. పంజాబ్ ఇప్పటికే తగినంత నష్టాన్ని చవిచూసిందని, ఇప్పుడిప్పుడే మంచి భవిష్యత్తు వైపు వెళ్లడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఏవో కారణాలు చెప్పి మళ్లీ అశాంతి సృష్టించవద్దని ఒక ప్రకటనలో ఆయన తెలిపారు.

Amritpal Singh: అమృత్‌పాల్ సింగ్‭ను పరారీలో ఉన్న నేరస్థుడిగా ప్రకటించిన పోలీసులు

గతంలో ప్రభుత్వాల వివక్ష కారణంగా సిక్కు యువతలో తీవ్ర అసంతృప్తి ఉందని ఆయన అన్నారు. కొంతమంది యువకులను బ్రెయిన్‌వాష్ చేసి తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. “తప్పుల నుండి పాఠాలు నేర్చుకుని, సిక్కుల దీర్ఘకాలిక మత, రాజకీయ, ఆర్థిక సమస్యలను సరళీకృతం చేయాలి. సిక్కులలో పరాయీకరణ భావన తొలగించాలి” అని హర్‌ప్రీత్ సింగ్ అన్నారు. భారతదేశ స్వాతంత్ర్యం కోసం అత్యధిక త్యాగాలు చేసింది సిక్కులేనని, అయితే వారిలో పరాయీకరణ భావాన్ని సృష్టించడంలో ఎప్పటికప్పుడు వివక్ష చూపిస్తూనే ఉన్నారని అన్నారు. గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాల నుంచి ప్రస్తుత ప్రభుత్వాలు పాఠాలు నేర్చుకోవాలని ఆయన కోరారు.

AP MLA Quota MLC elections : ఏపీలో ఆసక్తికరంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు

వేర్పాటువాద నాయకుడు అమృత్‌పాల్ సింగ్‌ను అరెస్టు చేసేందుకు కేంద్రం, రాష్ట్రాలు కలిసి పనిచేస్తున్న తరుణంలో మత గురువు ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఖలిస్తానీ నాయకుడు ఇప్పటికీ పరారీలో ఉన్నారు. అయితే అతని మద్దతుదారులలో 78 మందిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. అతని నలుగురు సహాయకులు, అతని సంస్థ ‘వారిస్ పంజాబ్ దే’ సభ్యులను అస్సాంలోని దిబ్రూఘర్‌కు తరలించారు. పోలీసులు తమను వెంబడిస్తున్నారని పేర్కొంటూ అతని సహాయకులు కొందరు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అధికారులు అనేక చోట్ల భద్రతను పెంచారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ సేవలను నిలిపివేశారు.

Opposition Front:తమ ఫ్రంటులోకి కాంగ్రెస్ పార్టీని ఎందుకు తీసుకోలేదో హింట్ ఇచ్చిన అఖిలేష్

కొద్ది రోజుల క్రితం అమృతపాల్ సింగ్ సహా అతని మద్దతుదారులు అజ్నాలా పోలీస్ స్టేషన్ మీద ఆయుధాలతో దాడి చేసిన విషయం తెలిసిందే. అమృతపాల్ సింగ్ అనుచరుడిని అరెస్ట్ చేయడం పట్ల వాళ్లు సృష్టించిన హంగామా అది. అతని విడుదల చేయడం కోసం కత్తులు, తుపాకీలతో పోలీసు స్టేషన్‌లోకి చొరబడి ఘర్షణకు పాల్పడ్డారు. ఈ ఘర్షణలో ఆరుగురు పోలీసు అధికారులు గాయపడ్డారు.