Sikkim : సిక్కింలో మరో వైరస్ కలకలం ..100 మంది విద్యార్ధుల్లో ఇన్ఫెక్షన్

కేరళలో టొమాటో ఫ్లూ ఆంత్రాక్స్ తర్వాత.. ఇప్పుడు సిక్కింలో ‘నైరోబి ఫ్లై ’కలకలం రేపుతోంది. ఇప్పటికే 100మంది విద్యార్దుల్లో ఈ నైరోబి ఫ్లై వ్యాప్తి పెరుగుతున్న పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి.

Sikkim : సిక్కింలో మరో వైరస్ కలకలం ..100 మంది విద్యార్ధుల్లో ఇన్ఫెక్షన్

Nairobi Flies In Sikkim

Nairobi Flies In Sikkim: కరోనా ఖతం అయ్యిందని సంతోషించినన్ని రోజులు లేదు. మరోసారి మహ్మారి వైరస్ కేసులు పెరుగుతున్నాయి. వీటికి తోడు భారత్ లో పలు వైరస్ లు కలకలం రేపుతున్నాయి. కేరళలో టొమాటో ఫ్లూ ఆంత్రాక్స్ తర్వాత.. ఇప్పుడు సిక్కింలో ‘నైరోబి ఫ్లై ’కలకలం రేపుతోంది. ఇప్పటికే 100మంది విద్యార్దుల్లో ఈ నైరోబి ఫ్లై వ్యాప్తి పెరుగుతోందనే వార్తలు అందరిలో ఆందోళన కలిగిస్తున్నాయి. సిక్కింలోని ఇంజినీరింగ్ కాలేజీలో ఇన్ఫెక్షన్ కేసు తెరపైకి రావడంతో కలకలం రేగింది. ఇప్పటివరకు అక్కడ 100 మంది విద్యార్థుల్లో నైరోబీ ఫ్లైస్ ఇన్ఫెక్షన్ వ్యాపించింది. సిక్కిం మణిపాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ క్యాంపస్‌లో ఈ కీటకాలు వేగంగా పెరుగుతున్నాయని ఆరోగ్య అధికారులు తెలిపారు.

పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రజలను ఈ ఈగలు గడగడలాడిస్తున్నాయి. ఉత్తర బెంగాల్‌లోని కొన్ని జిల్లాలు, పొరుగున ఉన్న సిక్కిం మరియు భూటాన్‌లోని కొన్ని ప్రాంతాల నుండి కూడా కేసులు నమోదయ్యాయి. అసలు ఇంతకు ఈ నైరోబీ ఫ్లై అంటే ఏంటీ.. వాటి వల్ల కలిగే ఇన్ఫెక్షన్‌ ఎంటీ.. ఎలా వ్యాపిస్తుంది..ఎంత ప్రమాదకరమో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

నైరోబీ ఫ్లై అంటే ఏమిటి?
నైరోబీ ఫ్లైది ఆఫ్రికాకు చెందిన కీటకాల జాతి. ఆఫ్రికా దేశమైన కెన్యాలో నైరోబీ ఈగల బారిన పడి వందలాది మంది అనారోగ్యం పాలవుతున్నారు. నైరోబీ ఫ్లై ని కెన్యాన్ ఫ్లై లేదా డ్రాగన్ ఫ్లై అని కూడా అంటారు. ఈ ఈగలు నారింజ, ఎరుపు, నలుపు రంగుల్లో ఉంటాయి. సాధారణ ఈగల కంటే పొడవుగా ఉంటాయి. ఇవి చర్మంపై ఇన్ఫెక్షన్ కలిగిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఈగలు మనుషులపై వాలితే శరీరం కాలినంతగా విపరీతమైన మంట, నొప్పి ఉంటుందని బాధితులు చెబుతున్నారు. అంతేకాదు జ్వరం వస్తుందని..వాంతులు కూడా అవుతున్నాయని వివరించారు. ఇవి గత కొన్ని వారాలుగా సిక్కిం వంటి అధిక వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో కనిపిస్తున్నాయని తెలిసింది.

అవి మనుషులకు ఎలా సోకుతాయి?
చాలా కీటకాలలా కాకుండా..నైరోబీ ఫ్లైస్ కాటు వేయవు. వాటికి చిరాకుగా ఉన్నప్పుడు నైరోబీ ఈగలు మానవుల చర్మంపై వాలిన తర్వాత పెడెరిన్ అనే రసాయనాన్ని విడుదల చేస్తాయి..ఇది చర్మంపై పడిన వెంటనే మంట పుడుతుంది. ఆ తర్వాత చర్మంగా ఎర్రగా మారి దద్దుర్లు వస్తాయని నిపుణులు తెలిపారు. 48 గంటల తర్వాత చర్మంపై బొబ్బలు దద్దుర్లు కనిపించడం ప్రారంభిస్తాయి. చర్మంపై దద్దుర్లు రావడంతోపాటు ఆ తర్వాత అది అంటువ్యాధిలా మారుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఎప్పుడు సీరియస్ అవుతుంది?
ఈగ ఎక్కువ విషాన్ని (పెడెరిన్) వ్యాపించి, అది శరీరం అంతటా వ్యాపిస్తే..అప్పుడు జ్వరం, నరాల నొప్పి, కీళ్ల నొప్పులు,వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇన్ఫెక్షన్ సోకాక ఒకవేళ పొరపాటున కళ్లను రుద్దితే విష రసాయనం కళ్లలోకి చేరి కండ్లకలకకు కారణమవుతుందని తెలిపారు. ఈగ ఎక్కువ రసాయనాన్ని మనిషిపై చిమ్మితే ప్రాణానికి కూడా ప్రమాదమంటున్నారు వైద్య నిపుణులు.

రక్షణామార్గాలు..
నైరోబీ బారిన పడకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. దోమతెరలో నిద్రించండి. ఫుల్ స్లీవ్ దుస్తులు ధరించటం. రాత్రిపూట ఆరుబటయ నిద్రించకపోవటం..ఇంట్లోకి దోమలు వంటి కీటకాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవటం వంటివి చేయాలి. దోమలు గానీ..ఈగలు గానీ మీ చేతిపై వాలితే..బ్రష్ సహాయంతో దాన్ని తీసివేయండి. దాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకండి..వెంటనే సబ్బు నీటితో శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే, మీకు తెలియకుండా దాని విష రసాయనం చర్మంపై వ్యాపించవచ్చు. ఇటువంటి సమయాల్లో కళ్లను అస్సలు తాకవద్దు..రుద్దవద్దు..