KNMA: దేశంలోనే అతిపెద్ద ఆర్ట్ అండ్ కల్చర్ సెంటర్ భవన నమూనా విడుదల చేసిన సర్ డేవిడ్ అడ్జాయే

ఈ మోడల్ కేంద్రంగా నిర్వహించిన ప్రదర్శనలో తయ్బ్ మెహతా, జరీనా, నస్రీన్ మొహమెదీల కలెక్షన్‭తో పాటుగా మ్యూజియం కలెక్షన్ ఒక శతాబ్దానికి పైగా విస్తరించి ఉంది. దీనితో పాటు సమకాలీన చిత్రనిర్మాత అమిత్ దత్తా తీసిన టచ్ ఎయిర్ చిత్రం కూడా ఉంది

KNMA: దేశంలోనే అతిపెద్ద ఆర్ట్ అండ్ కల్చర్ సెంటర్ భవన నమూనా విడుదల చేసిన సర్ డేవిడ్ అడ్జాయే

KNMA: కిరణ్ నాడార్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ (KNMA) తమ కొత్త భవనం యొక్క నిర్మాణ నమూనాను విడుదల చేసింది. స్థానిక ఆర్కిటెక్ట్ ఆఫ్ రికార్డ్‌గా ఎస్. ఘోష్ & అసోసియేట్స్ సహకారంతో ప్రఖ్యాత ఘనాయన్-బ్రిటీష్ ఆర్కిటెక్ట్ సర్ డేవిడ్ అడ్జాయే రూపొందించిన ఈ భవనం, ఢిల్లీలో నిర్మిస్తున్నారు. ఇది 2026లో పూర్తవుతుందని, అప్పటికి భారతదేశంలో ఇదే అతిపెద్ద సాంస్కృతిక కేంద్రంగా అవతరిస్తుందని అన్నారు. న్యూ ఢిల్లీలోని ఈ భవన నిర్మాణ ప్రాంగణం వద్ద జరిగిన భూమి పూజ కార్యక్రమంలో ఈ నమూనా విడుదల చేశారు.

Americans baned from Russia : బరాక్ ఒబామా సహా 500 మంది అమెరికన్లపై రష్యా నిషేధం..

ఈ మోడల్ కేంద్రంగా నిర్వహించిన ప్రదర్శనలో తయ్బ్ మెహతా, జరీనా, నస్రీన్ మొహమెదీల కలెక్షన్‭తో పాటుగా మ్యూజియం కలెక్షన్ ఒక శతాబ్దానికి పైగా విస్తరించి ఉంది. దీనితో పాటు సమకాలీన చిత్రనిర్మాత అమిత్ దత్తా తీసిన టచ్ ఎయిర్ చిత్రం కూడా ఉంది. KNMA ను 2010లో భారతదేశం నుంచి ఆధునిక, సమకాలీన ఆర్ట్ కలెక్టర్ లలో ఒకరిగా గుర్తింపు పొందిన కిరణ్ నాడార్ ఏర్పాటు చేశారు. ఇది భారతదేశంలో మార్గదర్శక ప్రైవేట్ మ్యూజియంగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం దీని శాఖలు న్యూఢిల్లీ, నోయిడాలో ఉన్నాయి. 100,000 చదరపు మీటర్లకు పైగా విస్తరించి ఉన్న ఈ కొత్త ప్రదేశం, ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో NH8 జాతీయ రహదారిపై ఉంది.