Americans baned from Russia : బరాక్ ఒబామా సహా 500 మంది అమెరికన్లపై రష్యా నిషేధం..

రష్యా అమెరికా విషయంలో టిట్ ఫర్ టాట్ అనే విధంగా వ్యవహరించింది. మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక ఒబామాతో పాటు 500లమంది అమెరికన్లపై నిషేధం విధించింది.

Americans baned from Russia :  బరాక్ ఒబామా సహా 500 మంది అమెరికన్లపై రష్యా నిషేధం..

us and russia

With obama Americans baned from Russia : రష్యా అమెరికా విషయంలో టిట్ ఫర్ టాట్ అనే విధంగా వ్యవహరించింది. మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక ఒబామాతో పాటు 500లమంది అమెరికన్లపై నిషేధం విధించింది. యుక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని వ్యతిరేకిస్తు ఆ దేశానికి సహకరించటమేకాకుండా అత్యాధునిక ఆయుధానలను అమెరికా సరఫరా చేయటం…అంతేకాకుండా రష్యాకు సంబంధించిన ఉత్పత్తులను కంపెనీలను నిషేధించటం వంటి చర్యలకు ప్రతీకారంగా రష్యా ఇలా అమెరికాకు ఎదురు దెబ్బకొట్టింది. 500లమంది అమెరికన్లు తమ దేశం రావటానికి వీల్లేదని..వారిలో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా ఉన్నారని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ శుక్రవారం (మే,2023)ప్రకటించింది. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్‌తో కలిసి ఐక్యరాజ్యసమితికి వెళ్లే మీడియాకు వీసాలు ఇచ్చేందుకు ఏప్రిల్ లో అమెరికా నిరాకరించిన క్రమంలో రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ ప్రకటన చేసింది.

యుక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాపై యూరప్ దేశాలు అనేక ఆంక్షలు విధిస్తున్నాయి. యుక్రెయిన్‌కు మొదటి నుంచి అండగా నిలుస్తున్న అమెరికా అనేక ఆంక్షలతో రష్యాను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఆర్థికంగా దెబ్బతీయటానికి యత్నిస్తోంది. దీనికి ప్రతీకారంగా నాకూ ఓ అవకాశం వచ్చిందనే చందంగా రష్యా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సహా 500 మంది అమెరికన్లకు తమ దేశంలో ప్రవేశాన్ని నిషేధిస్తున్నట్లు రష్యా ప్రకటించింది. నిషేధించిన వారిలో లిస్టులు బరాక్ ఒబామాతో పాటు ప్రముఖ టెలివిజన్ హోస్ట్‌లు స్టీఫెన్ కోల్‌బర్ట్, జిమ్మీ కిమ్మెల్, సేథ్ మేయర్స్ కూడా ఉన్నారు. సీఎన్ఎన్ యాంకర్ ఎరిన్ బర్నెట్, ఎంఎస్ఎన్బీసీ ప్రెజెంటర్లు రాచెల్ మాడో, జో స్కార్‌బరో కూడా ఉన్నారు.

‘మాపై జో బైడెన్ క్రమం తప్పకుండా విధించే రష్యా వ్యతిరేక ఆంక్షలకు ప్రతిస్పందనగా 500 మంది అమెరికన్లకు రష్యన్ ఫెడరేషన్‌లోకి ప్రవేశం నిషేధించాం’ అని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. యుక్రెయిన్ పై యుద్ధం కొనసాగిస్తున్న రష్యా ఆర్థిక వ్యవస్థను ఉక్కిరిబిక్కిరి చేసేలా అమెరికా రష్యాకు చెందిన వందలాది కంపెనీలు, వ్యక్తులను ఆంక్షల బ్లాక్‌లిస్ట్‌లో చేర్చింది.

దీనికి ప్రతిగా రష్యా ఏం మాత్రం తగ్గకుండా ప్రతీకారంగా ఇటువంటి నిర్ణయం తీసుకుంది. రష్యాకు వ్యతిరేకంగా శత్రు దేశాలు వేసే ప్రతీ చర్యకు కచ్చితంగా ప్రతిచర్య ఇవ్వకుండా ఉండదని అమెరికా చాలా కాలం క్రితమే నేర్చుకుని ఉండాల్సింది’ అని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ సందర్భంగా పేర్కొంది. తమ నిషేధిత లిస్టులో ఉన్న అమెరికా సెనేటర్లు, కాంగ్రెస్ సభ్యులు వంటి పలువురు ప్రముఖులు రష్యా వైఖరులను దెబ్బతీసే, అసత్యాలను వ్యాప్తి చేశారని ఆరోపించింది. యుక్రెయిన్‌కు ఆయుధాలను సరఫరా చేసే కంపెనీల అధిపతులను బ్లాక్ లిస్ట్ చేశామని రష్యా వెల్లడించింది.