Prince Movie: ఓటీటీలోకి దిగుతున్న ప్రిన్స్.. వచ్చేది ఎప్పుడంటే?

తెలుగులో ‘జాతిరత్నాలు’ సినిమాతో కామెడీ డైరెక్టర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు అనుదీప్. ఇక ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సాధించిన సెన్సేషన్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తరువాత అనుదీప్ తమిళ యంగ్ హీరో శివకార్తికేయన్‌తో కలిసి ప్రిన్స్ అనే సినిమాను తెరకెక్కించాడు.

Prince Movie: ఓటీటీలోకి దిగుతున్న ప్రిన్స్.. వచ్చేది ఎప్పుడంటే?

Sivakarthikeyan Prince Movie Locks OTT Release Date

Prince Movie: తెలుగులో ‘జాతిరత్నాలు’ సినిమాతో కామెడీ డైరెక్టర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు అనుదీప్. ఇక ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సాధించిన సెన్సేషన్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తరువాత అనుదీప్ తమిళ యంగ్ హీరో శివకార్తికేయన్‌తో కలిసి ప్రిన్స్ అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ సొంతం చేసుకుంది.

Prince Movie: రన్‌టైమ్ లాక్ చేసుకున్న శివకార్తికేయన్ ‘ప్రిన్స్’.. ఎంతో తెలుసా?

ఈ సినిమాతో అనుదీప్ మరోసారి ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేశాడు. ఇక శివకార్తికేయన్ సినిమాలకు తెలుగులో కూడా మంచి ఆదరణ లభిస్తుండటంతో ఈ సినిమాను చూసేందుకు జనం థియేటర్లకు వెళ్లారు. అయితే తాజాగా ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రెడీ చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాను నవంబర్ 25 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో తెలుగు, తమిళ భాషల్లో అందుబాటలోకి రానుంది.

Prince : సినిమా టికెట్లు ఇలా కూడా బుక్ చేస్తారా?? శివ కార్తికేయన్ ఫ్యాన్స్ రచ్చ మాములుగా లేదుగా..

ఇక ఈ సినిమాలో సత్యరాజ్ కీలక పాత్రలో నటించగా, థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. మరి ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో తెలియాలంటే నవంబర్ 25 వరకు వెయిట్ చేయాల్సిందే.