Prince Movie: రన్‌టైమ్ లాక్ చేసుకున్న శివకార్తికేయన్ ‘ప్రిన్స్’.. ఎంతో తెలుసా?

తమిళ యంగ్ హీరో శివకార్తికేయన్ నటిస్తున్న తాజా చిత్రం ‘ప్రిన్స్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సినిమాను ‘జాతిరత్నాలు’ చిత్ర దర్శకుడు అనుదీప్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాను తెలుగులో కూడా మంచి క్రేజ్ మధ్య రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. తాజాగా ఈ సినిమా రన్‌టైమ్‌ను చిత్ర యూనిట్ లాక్ చేసినట్లుగా తెలుస్తోంది.

Prince Movie: రన్‌టైమ్ లాక్ చేసుకున్న శివకార్తికేయన్ ‘ప్రిన్స్’.. ఎంతో తెలుసా?

Sivakarthikeyan Prince Movie Runtime Locked

Prince Movie: తమిళ యంగ్ హీరో శివకార్తికేయన్ నటిస్తున్న తాజా చిత్రం ‘ప్రిన్స్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సినిమాను ‘జాతిరత్నాలు’ చిత్ర దర్శకుడు అనుదీప్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాను తెలుగులో కూడా మంచి క్రేజ్ మధ్య రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఇక ఇటీవల రిలీజ్ అయిన ఈ చిత్ర టీజర్, ట్రైలర్లు ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేశాయి.

Prince Trailer : ఇండియా అబ్బాయి-బ్రిటిష్ అమ్మాయి లవ్ స్టోరీ.. జాతిరత్నాలు డైరెక్టర్ ‘ప్రిన్స్’ ట్రైలర్ చూశారా??

తాజాగా ఈ సినిమా రన్‌టైమ్‌ను చిత్ర యూనిట్ లాక్ చేసినట్లుగా తెలుస్తోంది. పూర్తి రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా రన్‌టైమ్ 2 గంటల 23 నిమిషాలకు లాక్ చేసింది చిత్ర యూనిట్. ఇలాంటి రన్‌టైమ్ సినిమాకు బాగా కలిసొస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇక ఈ సినిమాలో శివకార్తికేయన్ సరసన మరియా ర్యాబోషప్క హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడం ఖాయమని చిత్ర యూనిట్ చెబుతోంది.

Prince Movie: అనుదీప్ శివకార్తికేయన్‌ల ప్రిన్స్ మూవీ నుంచి కొత్త అప్డేట్

ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా, తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాను మంచి అంచనాల మధ్య దీపావళి కానుకగా అక్టోబర్ 21న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. మరి ప్రిన్స్ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.