LPL 2023 : లంక ప్రీమియర్ లీగ్‌లో అనుకోని అతిథి.. బంగ్లాదేశ్ నుంచి వచ్చిందన్న దినేశ్ కార్తీక్
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న లంకప్రీమియర్ లీగ్(LPL) 2023 సీజన్ ఆదివారం (జూలై 30)న ప్రారంభమైంది. రెండో మ్యాచ్ సోమవారం గాలె టైటాన్స్, దంబుల్లా ఆరా జట్ల మధ్య జరిగింది.

Snake Spotted During LPL Match
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న లంకప్రీమియర్ లీగ్(LPL) 2023 సీజన్ ఆదివారం (జూలై 30)న ప్రారంభమైంది. రెండో మ్యాచ్ సోమవారం గాలె టైటాన్స్, దంబుల్లా ఆరా జట్ల మధ్య జరిగింది. అయితే.. ఓ అనుకోని అతిథి కారణంగా ఈ మ్యాచ్‌కు కొద్ది సేపు అంతరాయం కలిగింది. ఓ పాము మైదానంలోకి రావడంతో ఆటను నిలిపివేశారు. పామును బయటకు వెళ్లగొట్టిన తరువాత మ్యాచ్‌ను నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Nicholas Pooran Video: 13 సిక్సులు.. క్రికెట్ ఫ్యాన్స్‌కి మర్చిపోలేని అనుభవాన్ని ఇచ్చిన నికోలస్
దంబుల్లా జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పాము మైదానంలో కనిపించింది. ఆ సమయంలో క్రీజులో ధనంజయ్ డిసిల్వా, కుశాల్ పెరీరా ఉన్నారు. పాము రావడంతో ఆటను ఆపేశారు. వెంటనే మైదాన సిబ్బంది అక్కడకు చేరుకుని పామును బౌండరీ బయటకు తరిమారు. ఆ తరువాత మళ్లీ మ్యాచ్ కొనసాగింది. ఈ వీడియో వైరల్‌గా మారగా నెటీజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
We could only capture this ????????? moment due to our world-class ??????????!#LPL2023onFanCode #LPL pic.twitter.com/lhMWZKyVfy
— FanCode (@FanCode) July 31, 2023
Rohit Beats Chahal : చాహల్‌ను కొట్టిన రోహిత్.. పక్కనే ఉన్న కోహ్లి ఏం చేశాడంటే..?
కాగా.. భారత క్రికెటర్, వ్యాఖ్యాత అయిత దినేశ్ కార్తీక్ దీనిపై సరదాగా స్పందించాడు. పామును “నాగిన్” అని పేర్కొన్నాడు. నాగిని మళ్లీ వచ్చింది. బహుశా ఇది బంగ్లాదేశ్ నుంచి వచ్చిందేమో అంటూ లాఫింగ్ ఎమోజీలను పోస్ట్ చేశాడు. 2018లో నిదాహాస్ ట్రోఫీ సందర్భంగా బంగ్లాదేశ్ క్రికెటర్లు చేసిన నాగిన్ డ్యాన్స్ ను ప్రస్తావిస్తూ దినేశ్ కార్తీక్ ఆ పాము బంగ్లాదేశ్ నుంచి వచ్చిందేమో అంటూ ఫన్నీ కామెంట్ చేశాడు.
The naagin is back
I thought it was in Bangladesh ?????#naagindance#nidahastrophy https://t.co/hwn6zcOxqy
— DK (@DineshKarthik) July 31, 2023