Nicholas Pooran Video: 13 సిక్సులు.. క్రికెట్ ఫ్యాన్స్‌కి మర్చిపోలేని అనుభవాన్ని ఇచ్చిన నికోలస్

మొత్తం 13 సిక్సులు, 10 ఫోర్లతో నికోలస్ పూరన్ చెలరేగిపోయాడు. దీంతో..

Nicholas Pooran Video: 13 సిక్సులు.. క్రికెట్ ఫ్యాన్స్‌కి మర్చిపోలేని అనుభవాన్ని ఇచ్చిన నికోలస్

Nicholas Pooran

Updated On : July 31, 2023 / 5:05 PM IST

Nicholas Pooran Video-  MLC Final: అమెరికన్ క్రికెట్ ఎంటర్‌ప్రైజెస్ నిర్వహించిన మొట్టమొదటి మేజర్ లీగ్ క్రికెట్ (Major League Cricket) గత రాత్రి ముగిసింది. మొట్టమొదటి టైటిల్ ను ఎంఐ న్యూయార్క్ (MI New York) గెలుచుకుంది. డల్లాస్ లో జరిగిన ఫైనల్లో సీటెల్ ఓర్కాస్ పై ఎంఐ న్యూయార్క్ జట్టు 24 బంతులు మిగిలి ఉండగానే ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది.

మొదట బ్యాటింగ్ చేసిన సీటెల్ ఓర్కాస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 183/9 స్కోరు చేసింది. ఆ జట్టు బ్యాటర్ క్వింటన్ డి కాక్ 87 పరుగులు బాదాడు. దీంతో సీటెల్ ఓర్కాస్ జట్టు విజయం సాధిస్తుందని అందరూ భావించినప్పటికీ, ఆ జట్టు విజయావకాశాలను ఎంఐ న్యూయార్క్ బ్యాటర్ నికోలస్ పూరన్ తలకిందులు చేశాడు. 55 బంతుల్లో 137 పరుగులు బాది అజేయంగా నిలిచాడు.

మొత్తం 13 సిక్సులు, 10 ఫోర్లతో నికోలస్ పూరన్ చెలరేగిపోయాడు. దీంతో 183 పరుగులు చేసినప్పటికీ సీటెల్ ఓర్కాస్ జట్టు ఓటమి పాలైంది. నికోలస్ పూరన్ వెస్టిండీస్ జాతీయ జట్టు ఆటగాడు. మేజర్ లీగ్ క్రికెట్‌లో అతడు మొత్తం 388 పరుగులు చేసి, ఈ లీగ్ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

ఫైనల్ మ్యాచులో సీటెల్ ఓర్కాస్ జట్టు బ్యాటర్ క్వింటన్ డి కాక్ (87), ఎంఐ న్యూయార్క్ బ్యాటర్ నికోలస్ పూరన్ (137) మినహా ఏ బ్యాటర్ కనీసం 30 పరుగుల స్కోరు చేయలేకపోయాడు. అద్భుత రీతిలో ఆడి ప్రేక్షకుల మతి పోగొట్టేట్లు చేసిన నికోలస్ పూరన్ ను క్రికెట్ అభిమానులు ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. అతడు సిక్సులు కొట్టిన తీరుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Yusuf Pathan Video: సిక్సులు, ఫోర్ల వర్షం కురిపిస్తూ ప్రేక్షకుల మతిపోగొట్టిన యూసఫ్ పఠాన్.. 26 బాల్స్ 80 రన్స్