Sobhita Dhulipala : సమంత, నాగచైతన్యలపై మరోసారి శోభిత కామెంట్స్.. వాళ్ళ గురించి ఏం చెప్పిందంటే..

సిరీస్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది శోభిత. ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాజాగా సమంత, నాగచైతన్య గురించి మాట్లాడింది. అయితే రూమర్స్ గురించి కాకుండా వారిద్దరి గురించి విడివిడిగా అడగగా వారు ఎలాంటి వారో చెప్పింది శోభిత.

Sobhita Dhulipala : సమంత, నాగచైతన్యలపై మరోసారి శోభిత కామెంట్స్.. వాళ్ళ గురించి ఏం చెప్పిందంటే..

Sobhita Dhulipala comments on Naga Chaitanya and Samantha in Bollywood Interview

Updated On : June 24, 2023 / 1:44 PM IST

Naga Chaitanya – Samantha :  తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ తెలుగులో గూడాచారి(Goodachari), మేజర్(Major) సినిమాలే తీసినా హిందీలో మాత్రం వరుస సినిమాలు, సిరీస్ లతో బిజీగా ఉంది. ప్రస్తుతం పలు హిందీ సినిమాలు, సిరీస్ లతో బిజీగా అంది శోభిత. నాగ చైతన్య, సమంత విడాకుల తర్వాత శోభిత – నాగ చైతన్య డేటింగ్ లో ఉన్నారని, ఇద్దరూ కలిసి తిరిగితున్నారని పలు వార్తలు వచ్చాయి. వీరిద్దరూ కలిసి దిగిన ఓ ఫొటో కూడా వైరల్ గా మారింది. అయితే గతంలోనే వీటిపై స్పందిస్తూ అలాంటిదేమి లేదు అని చెప్పింది.

అయినా శోభిత ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా నాగచైతన్య గురించి ప్రశ్నిస్తున్నారు. శోభిత నటించిన ది నైట్ మేనేజర్ సీజన్ 2(The Night Manager) జూన్ 30న హాట్‌స్టార్ ఓటీటీలో విడుదల కానుంది. దీంతో ఆ సిరీస్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది శోభిత. ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాజాగా సమంత, నాగచైతన్య గురించి మాట్లాడింది. అయితే రూమర్స్ గురించి కాకుండా వారిద్దరి గురించి విడివిడిగా అడగగా వారు ఎలాంటి వారో చెప్పింది శోభిత.

Pooja Hegde : ‘బుట్టబొమ్మ’కు ఏమైంది.. సినిమాలు జారిపోతున్నాయా? వదిలేసుకుంటుందా?

శోభిత సమంత గురించి మాట్లాడుతూ.. తన సినిమా కెరీర్ బాగుంటుంది. మీరు తన సినిమాలు చూస్తే కనుక అన్ని గొప్ప సినిమాలే ఉంటాయి. ప్రస్తుతం ఆమె సెలక్షన్ అయితే మరింత అద్భుతంగా ఉంటుంది. ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ ఆమె సెలక్షన్స్ లో బెస్ట్ ఛాయస్. ఆమె ఎంచుకునే ప్రాజెక్ట్స్ గొప్పగా ఉంటాయి. ప్రస్తుతం ఆమె సినీ కెరీర్ బాగా సాగుతుంది అని తెలిపింది. ఇక నాగ చైతన్య గురించి మాట్లాడుతూ.. చైతన్య చాలా హుందాగా, గౌరవంగా, కూల్ గా ఉంటాడు. వేరేవాళ్లతో మర్యాదగా ప్రవర్తిస్తాడు. అతను అందరితోనూ మంచిగా ఉంటాడు అని తెలిపింది. అయితే తనపై వచ్చే రూమర్స్ గురించి మాత్రం శోభిత మళ్ళీ మాట్లాడలేదు. ఇక సమంత, చైతూలపై శోభిత చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.