Thaman: మహేష్‌కి పాటలు.. ప్రభాస్‌కి బీజీఎం.. హైప్ పెంచేస్తున్న థమన్
సంగీత దర్శకుడు థమన్ ఇప్పుడు సూపర్ డూపర్ స్వింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. చేయి వేసిన ప్రతి సినిమా మ్యూజిక్ ని బ్లాక్ బస్టర్ గా నిలిపుతున్న థమన్ నుండి తాజాగా కళావతి సాంగ్ మరోసారి..

Thaman
Thaman: సంగీత దర్శకుడు థమన్ ఇప్పుడు సూపర్ డూపర్ స్వింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. చేయి వేసిన ప్రతి సినిమా మ్యూజిక్ ని బ్లాక్ బస్టర్ గా నిలిపుతున్న థమన్ నుండి తాజాగా కళావతి సాంగ్ మరోసారి మెస్మరైజ్ చేసిన సంగతి తెలిసిందే. మహేష్ సర్కారు వారి పాట నుండి వచ్చిన కళావతి సాంగ్ ఇప్పటికీ యూట్యూబ్ లో రికార్డులు కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ఈ సినిమా నుండి సెకండ్ సింగిల్ కోసం ప్రిపరేషన్ మొదలైందట.
DSP-Thaman: పోటీపడుతున్న ఈ ఇద్దరూ.. మ్యూజిక్‌తో బాక్సులు బద్దలే!
ఫస్ట్ సింగిల్ కళావతిని సెన్సేషనల్ హిట్ చేసినందుకే చాలా థాంక్స్, ఈ రోజు నుంచే సర్కారు వారి పాట రెండో సాంగ్ కి ప్రిపరేషన్స్ మొదలు పెట్టేశామని, ఇది కూడా సాలిడ్ ట్యూన్ అంటూ ట్వీట్ చేసిన థమన్ మహేష్ అభిమానులకు ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చాడు. దీనితో ఇది మరింత ఆసక్తిగా మారింది. ఇక ఈ సాంగ్ ఎప్పుడు బయటకొస్తుందో చూడాలి.
S.Thaman: బీజీఎం స్పెషలిస్ట్ థమన్.. స్పెషల్ ఆఫర్లు ఇస్తున్న మేకర్స్!
పాటలతో పాటు బ్యాగ్ గ్రౌండ్ స్కోర్ చేయడంలో థమన్ కి పెట్టింది పేరు. అఖండ లాంటి సినిమాకి ఊపు వచ్చిందంటే అందులో థమన్ క్రెడిట్ ఎంతో ఉందని అందరూ మాట్లాడుకున్నారు. కాగా, థమన్ ఇప్పుడు ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాకి కూడా బీజీఎమ్ అందిస్తున్నాడు. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో పలు మార్లు పంచుకుంటున్న థమన్ రాధేశ్యామ్ మరో మ్యాజిక్ చేస్తుందని హైప్ పెంచుతూ వస్తున్నాడు.
Nani-Thaman: మ్యూజిక్‌పై నానీ కామెంట్స్.. తమన్ కౌంటర్ ట్వీట్స్?
తాజాగా రాధేశ్యామ్ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి థమన్ పెట్టిన పోస్ట్ ప్రభాస్ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తుంది. మా నుంచి ఒక క్రేజీయెస్ట్ స్కోర్ ని మీరు అంతా వినబోతున్నారని మున్ముందు మరిన్ని ఆసక్తికర అప్డేట్స్ మీకోసం రాబోతున్నాయని. చాలా కాలం తర్వాత ఒక మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ తాను ఇచ్చానని చెప్పుకొచ్చాడు. ఇప్పటికే వచ్చిన ట్రైలర్స్, టీజర్స్, మేకింగ్ వీడియోలలో థమన్ మార్క్ స్పష్టంగా కనిపించింది. మరి ఇప్పుడు రాబోయే అప్డేట్స్ ఎలా ఉంటాయో.. సినిమాలో బీజీఎమ్ ఎలా అంటుందో ఆసక్తిగా మారింది.
https://twitter.com/MusicThaman/status/1500284650383876096?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1500284650383876096%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fd-31989795664222388933.ampproject.net%2F2202230359001%2Fframe.html
https://twitter.com/MusicThaman/status/1500287200151621636?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1500287200151621636%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fd-31473227662157842368.ampproject.net%2F2202230359001%2Fframe.html