Sonia Gandhi: ప్రజాస్వామ్యానికి ఫేస్ బుక్ ప్రమాదకరం – సోనియా గాంధీ

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అసలే ఫైర్ మీద ఉన్నారు. మంగళవారం జరిగిన మీటింగ్ తర్వాత ఐదు రాష్ట్రాల పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ లను రాజీనామా చేయాలని ఆదేశించారు.

Sonia Gandhi: ప్రజాస్వామ్యానికి ఫేస్ బుక్ ప్రమాదకరం – సోనియా గాంధీ

Sonia Gandhi

Sonia Gandhi: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అసలే ఫైర్ మీద ఉన్నారు. మంగళవారం జరిగిన మీటింగ్ తర్వాత ఐదు రాష్ట్రాల పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ లను రాజీనామా చేయాలని ఆదేశించారు. బుధవారం లోక్‌సభ జీరో అవర్లో మాట్లాడిన సోనియా సోషల్ మీడియాపై దుమ్మెత్తిపోశారు.

ఫేస్‌బుక్ సామాజిక మాధ్యమాలు దేశ ప్రజాస్వామ్యంలో జోక్యం చేసుకుంటున్నాయని, వ్యవస్థీకృత జోక్యానికి అంతం పలకాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు సోనియా.

‘ఎన్నికల ప్రకటనల కోసం బీజేపీకి ఫేస్‌బుక్ తక్కువ ధరకు డీల్స్ కుదుర్చుకుందని అంతర్జాతీయ కథనాలను ఉటంకించిన సోనియాగాంధీ.. రాజకీయ పార్టీల ప్రచారం విషయంలో ఫేస్ బుక్ పక్షపాతం వహిస్తుందని విమర్శలకు దిగారు’

Read Also: సిద్దూ రాజీనామా చేసేయ్ – సోనియా గాంధీ

‘ప్రజాస్వామ్యాన్ని హ్యాక్ అవడం ద్వారా సోషల్ మీడియా దుర్వినియోగం అయ్యే ప్రమాదం పెరుగుతోంది. నాయకులు, రాజకీయ పార్టీలు రాజకీయ కథనాలను రూపొందించడానికి ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి గ్లోబల్ కంపెనీలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు’

‘గ్లోబల్ సోషల్ మీడియా కంపెనీలు రాజకీయ పార్టీలన్నింటికీ సమాన అవకాశాలు అందించడం లేదు. ప్రభుత్వం, అధికార యంత్రాంగం అండదండలతో ఫేస్‌బుక్ ద్వారా సామాజిక సామరస్యానికి విఘాతం కలిగిస్తున్నాయి. ఈ తీరు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం’

‘భావోద్వేగపూరితమైన తప్పుడు సమాచారంతో యువకుల మనసులు ద్వేషంతో నింపుతున్నారు. అధికారంలో ఎవరున్నా ప్రజాస్వామ్యాన్ని, సామాజిక సామరస్యాన్ని కాపాడుకోవాలి’ అని పిలుపునిచ్చారు.