UP : స్ట్రాంగ్ రూం వద్ద బైనాక్యులర్‌‌తో ఎస్పీ అభ్యర్థి నిఘా.. 24 గంటల పాటు భద్రత

మీరట్ లో బైనాక్యులర్ చేతపట్టుకుని... నిఘా ఉంటుండడం.. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి...

UP : స్ట్రాంగ్ రూం వద్ద బైనాక్యులర్‌‌తో ఎస్పీ అభ్యర్థి నిఘా.. 24 గంటల పాటు భద్రత

Sp Up

SP candidate Yogesh Verma : ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై దేశం మొత్తం ఉత్కంఠ నెలకొంది. గత కొద్ది రోజుల క్రితం ఎన్నికల పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. 2022, మార్చి 10వ తేదీ గురువారం ఫలితాలను వెల్లడికానున్నాయి. ఇందుకు అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. స్ట్రాంగ్ రూమ్ ల నుంచి ఈవీఎంలను కౌంటింగ్ కేంద్రాలకు తరలించనున్నారు. స్ట్రాంగ్ రూమ్ ల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కానీ.. ఈ భధ్రతపై సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి యోగేశ్ వర్మకు డౌట్ వచ్చినట్లు ఉంది. ఆయన మీరట్ లో బైనాక్యులర్ చేతపట్టుకుని… నిఘా ఉంటుండడం.. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన మద్దతుదారులను కూడా నిఘాలో భాగస్వామ్యం చేస్తున్నారు. ఈయన హస్తినాపూర్ నుంచి పోటీ చేశారు.

Read More : Five States Election : రేపే ఎన్నికల ఫలితాలు.. సర్వత్రా ఉత్కంఠ, విజేతలు ఎవరో ?

ఈవీఎంలను తరలించిన స్ట్రాంగ్ రూమ్ ల వద్ద 24 గంటల పాటు స్ట్రాంగ్ రూమ్ నే గమనిస్తున్నారు. దీని కోసం మూడు షిప్టులుగా నిఘా పెడుతున్నారు. ఒక్కొక్కరు 8 గంటల పాటు బైనాక్యులర్ తో నిరంతరం స్ట్రాంగ్ రూమ్ ను పర్యవేక్షిస్తున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారని మీడియా ప్రశ్నించింది. తనకు అధికారులపై నమ్మకం ఉందని, ప్రజా తీర్పును పరిరక్షించేందుకు ఎలాంటి అవకాశాన్ని వదులుకోనని వెల్లడిస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ పై ఆయన స్పందించారు. బీజేపీ గెలవదనే విషయాన్ని ఆయన వెల్లడిస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ కరెక్టు కాదని, గత సంవత్సరం బెంగాల్ లో బీజేపీ గెలుస్తుందని అన్నీ సర్వేలు అంచనా వేసిన సంగతి గుర్తు చేశారు. కానీ ఫలితం ఎలా వచ్చిందో అందరికీ తెలిసిందేనని, మమత భారీ మెజార్టీ సాధించి అధికారంలోకి వచ్చారన్నారు. ఈసారి కూడా అలాగే జరుగుతుందని జోస్యం చెప్పారు. ఏడు విడతల్లో యూపీలో ఎన్నికల పోలింగ్ జరిగింది. మార్చి 10వ తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి. బీజేపీనే అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. ఎస్పీ మాత్రం విజయంపై ధీమా పెట్టుకుంది. తామే గెలుస్తామని ఎస్పీ నేతలు స్పష్టం చేస్తున్నారు. మరి ఎలాంటి తీర్పు వెలువడనుందో రేపటి వరకు వెయిట్ చేయాలి.