Statue Of Equality : సమతాస్ఫూర్తి.. రామానుజ మూర్తి..! గురువారం జరిగే కార్యక్రమాల వివరాలు

శ్రీ రామానుజుల సహస్రాబ్ది వేడుకలు సాయంత్రం 5 గంటలకు అంకురార్పణతో ప్రారంభమవుతాయి. శ్రీరామనగరంలోని దేవాలయం నుంచి శోభాయాత్ర కన్నుల పండుగగా సాగుతోంది.

Statue Of Equality : సమతాస్ఫూర్తి.. రామానుజ మూర్తి..! గురువారం జరిగే కార్యక్రమాల వివరాలు

Samatamoorthy

Statue Of Equality Muchintal : అణువణువునా ఆధ్యాత్మికత…అడుగడుగునా భక్తి పారవశ్యం….శ్రీరామనగరం..సర్వాంగ సుందరం….ముచ్చింతల్‌లో మహత్తర ఘట్టం ఇవాళ ప్రారంభం కానుంది. అసమానతలపై అలుపెరగని పోరాటం చేసి..సమతాస్ఫూర్తిని చాటిన సమతామూర్తి శ్రీ రామానుజుల సహస్రాబ్ది వేడుకలు సాయంత్రం 5 గంటలకు అంకురార్పణతో ప్రారంభమవుతాయి. శ్రీరామనగరంలోని దేవాలయం నుంచి శోభాయాత్ర కన్నుల పండుగగా సాగుతోంది. భారీగా తరలివచ్చిన భక్తజనం యాత్రలో పాల్గొంటున్నారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి నేతృత్వంలో యాత్ర సాగుతోంది. యాగశాల దగ్గర వాస్తుశాంతి హోమం నిర్వహిస్తున్నారు. 2022, ఫిబ్రవరి 02వ తేదీ బుధవారం సాయంత్రం 5 గంటలకు అంకురార్పణ జరుగనుంది. ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు మొదటి రోజు కార్యక్రమాలు జరుగుతాయి.

Read More : SC : నామినేషన్ వేయాలట..వారెంట్ ఉన్నా..అత్యాచారం కేసులో ఎమ్మెల్యేను అరెస్ట్ చేయవద్దంటున్న సుప్రీంకోర్టు

2022, ఫిబ్రవరి 03వ తేదీ గురువారం జరిగే కార్యక్రమాలు ఈ విధంగా ఉన్నాయి.
ఉదయం 6.30 గంటల నుంచి 7.30 గంటల వరకు అష్టాక్షరీమంత్ర జపం.
ఉదయం 9 గంటల నుంచి 12.15 వరకు యాగశాలలో యజ్ఞం.
మధ్యాహ్నం 12.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పూర్ణాహుతి, ప్రసాద వితరణ.
మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు విరామం.

Read More : Ashureddy : ఆర్జీవీ నుంచి నేర్చుకున్నాం అంటూ.. అరియనా నడుముపై అషూరెడ్డి ముద్దు.. నెటిజన్స్ ట్రోలింగ్

సాయంత్రం 4.30 గంటల నుంచి 5.30 గంటల వరకు యాగశాలలో హోమం.
సాయంత్రం 5 గంటల నుంచి 5.30 గంటల వరకు శ్రీవిష్ణు సహస్రనామ పారాయణం.
సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు అతిథుల ప్రసంగాలు.
రాత్రి 7.30 గంటల నుంచి 8 గంటల వరకు శ్రీరామానుజచార్య లైవ్ లేజర్ షో.
రాత్రి 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, పూర్ణాహుతి.