M K Stalin: స్టాలిన్ ఏడాది పాలన పూర్తి.. కొత్త పథకాల ప్రకటన

తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎమ్.కె.స్టాలిన్ అధికారం చేపట్టి ఏడాది పూర్తవుతోంది. మొదటి వార్షికోత్సవం సందర్భంగా రాష్ట్రంలో కొత్త పథకాలు ప్రకటించారు స్టాలిన్.

M K Stalin: స్టాలిన్ ఏడాది పాలన పూర్తి.. కొత్త పథకాల ప్రకటన

M K Stalin

M K Stalin: తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎమ్.కె.స్టాలిన్ అధికారం చేపట్టి ఏడాది పూర్తవుతోంది. మొదటి వార్షికోత్సవం సందర్భంగా రాష్ట్రంలో కొత్త పథకాలు ప్రకటించారు స్టాలిన్. శుక్రవారం చెన్నైలో లోకల్ బస్సులో ప్రయాణించిన స్టాలిన్ అనంతరం మహిళలకు బస్సుల్లో ఉచిత రవాణా సదుపాయం కల్పించనున్నట్లు ప్రకటించారు. ఇది గత ఏడాది ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ కావడం గమనార్హం. దీంతోపాటు ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు పోషకాహారంతో కూడిన బ్రేక్‌ఫాస్ట్ అందించాలని కూడా నిర్ణయించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి ఐదో తరగతి చదివే పిల్లలకు ప్రతి రోజూ ఉదయం బ్రేక్‌ఫాస్ట్ ఇస్తారు.

Tamil Nadu: శ్రీలంకకు తమిళనాడు సాయం.. కేంద్రం అంగీకారం

పట్టణాల్లో మరిన్ని వైద్య సదుపాయాలు కల్పించనున్నట్లు కూడా ప్రకటించారు. అలాగే ఏడాది కాలంలో ప్రభుత్వం సాధించిన విజయాల గురించి అసెంబ్లీలో చెప్పుకొచ్చారు. దాదాపు పదేళ్లపాటు అధికారానికి దూరంగా, ప్రతిపక్షానికే పరిమితమైన డీఎమ్‌కే పార్టీని, స్టాలిన్ 2021లో అధికారంలోకి తెచ్చారు. స్టాలిన్ మొదటిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటికీ, గతంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది.