Tamil Nadu: శ్రీలంకకు తమిళనాడు సాయం.. కేంద్రం అంగీకారం

శ్రీలంకకు సాయం చేసేందుకు అంగీకరిస్తూ తమిళనాడు ప్రభుత్వానికి కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్ సోమవారం లేఖ రాశారు.

Tamil Nadu: శ్రీలంకకు తమిళనాడు సాయం.. కేంద్రం అంగీకారం

Tamil Nadu

Tamil Nadu: ఆర్థిక సంక్షోభంలో కూరుకున్న శ్రీలంకకు మానవతా సాయం అందించాలన్న తమిళనాడు ప్రతిపాదనకు కేంద్రం అంగీకారం తెలిపింది. శ్రీలంకకు సాయం చేసేందుకు అంగీకరిస్తూ తమిళనాడు ప్రభుత్వానికి కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్ సోమవారం లేఖ రాశారు. ఈ విషయంలో కేంద్రంతో సమన్వయం చేసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. కొంత కాలంగా శ్రీలంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ కూడా లంకకు సాయం చేసింది.

SriLanka Economic Crisis Update : కిలో పాలపొడి రూ.2వేలు.. శ్రీలంకలో ఆకలి కేకలు

అయితే, తమిళనాడు ప్రభుత్వం కూడా వేరుగా సాయం అందించాలనుకుంటోంది. ఇది విదేశీ వ్యవహారం కాబట్టి, దీనికి కేంద్రం ఆమోదం తెలపడం తప్పనిసరి. దీంతో తమ ప్రతిపాదనను అంగీకరించాలని తమిళనాడు ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. గత నెలలో సీఎం స్టాలిన్, ప్రధాని మోదీని కలిసి నేరుగా కోరడంతోపాటు లేఖ రాసినా కేంద్రం నుంచి స్పందన లేదు. చివరకు గత వారం తమిళనాడు అసెంబ్లీ దీనిపై తీర్మానం చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్రం దీనికి అంగీకరిస్తూ నిర్ణయం తీసుకుంది.