Star Heros : పండగలని లాక్ చేసుకుంటున్న హీరోలు..

 సినిమా తియ్యడం ఒక ఎత్తైతే దాన్ని మంచి టైమ్ చూసుకుని రిలీజ్ చెయ్యడం మరో ఎత్తు. సీజన్ చూస్కోవాలి, ఏ స్టార్ హీరో సినిమా క్లాష్ లేకుండా చూస్కోవాలి. అందుకే సినిమా అవ్వకుండానే రిలీజ్ డేట్స్............

Star Heros : పండగలని లాక్ చేసుకుంటున్న హీరోలు..

Star Heros

Star Heros :   సినిమా తియ్యడం ఒక ఎత్తైతే దాన్ని మంచి టైమ్ చూసుకుని రిలీజ్ చెయ్యడం మరో ఎత్తు. సీజన్ చూస్కోవాలి, ఏ స్టార్ హీరో సినిమా క్లాష్ లేకుండా చూస్కోవాలి. అందుకే సినిమా అవ్వకుండానే రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకుంటున్నారు. అదీకాక ఈ సంవత్సరం సంక్రాంతి నుంచి సమ్మర్ వరకూ జరిగిన రిలీజ్ డేట్స్ పంచాయితీలు దృష్టిలో పెట్టుకుని ముందే సీజన్ల మీద ఖర్చీఫ్ వేసుకుంటున్నారు హీరోలు.

హీరోలు జాగ్రత్త పడుతున్నారు. ఎంత కష్టపడి సినిమా చేసినా కరెక్ట్ టైమ్ కి రిలీజ్ చెయ్యకపోతే పడ్డ కష్టమంతా వేస్టే. అందుకే ఈమధ్య రిలీజ్ డేట్స్ విషయంలో కాస్త ముందుచూపుతోనే ఉంటున్నారు ప్రొడ్యూసర్లు కూడా. అదీకాక కోవిడ్ తో పోస్ట్ పోన్ అయిన సినిమాలన్నీ ఒకేసారి రిలీజ్ కి రెడీ అవడంతో ఈ సంవత్సరం రిలీజ్ క్లాష్ లతో పాటు రిలీజ్ డేట్స్ మార్చుకోవడానికి టాలీవుడ్ లో పంచాయితీలు కూడా హాట్ టాపిక్ అయ్యాయి. అందుకే ఈ సారి ముందే ఖర్చీఫ్ వేసుకుంటున్నారు హీరోలు.

మెగాస్టార్ అయితే ఈ లిస్ట్ లో ముందే ఉన్నారు. చిరంజీవి అప్ కమింగ్ ఫిల్మ్ గాడ్ ఫాదర్ ని అయితే వినాయక చవితికే రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. బాలయ్య బాబు అయితే ఇంకాస్త స్పీడ్ పెంచేశారు. అఖండ హిట్ వైబ్స్ కంటిన్యూ అవుతుండగానే అప్పుడే గోపీచంద్ మలినేనితో సినిమాని సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తున్నారు. ఈ సినిమాని దసరాకే రిలీజ్ చెయ్యాలని టార్గెట్ పెట్టుకున్నారు టీమ్. ఇక అనిల్ రావిపూడితో ఆగస్ట్ లో స్టార్ట్ చెయ్యబోతున్న సినిమాని సంక్రాంతి బరిలోకి దింపాల్సిందే అని గట్టిగా ప్లాన్ చేసుకుంటున్నారు బాలయ్య.

Ante Sundaraniki : మరో కొత్త రికార్డు సృష్టించిన నాని.. అమెరికాలో ఏడు 1 మిలియన్ డాలర్ సినిమాలు..

సంక్రాంతి కి సూపర్ హిట్ ట్రాక్ ఉన్న మహేష్ బాబు అయితే వచ్చే సంక్రాంతికి కూడా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. త్రివిక్రమ్ తో నెక్ట్స్ మంత్ స్టార్ట్ చేస్తున్న సినిమాని సంక్రాంతికి ఫినిష్ చెయ్యాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఇప్పటికే స్టోరీ లాక్ చేసుకున్న ఈ టీమ్ త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చెయ్యబోతోంది. 6 నెలల్లో షూటింగ్ కంప్లీట్ చేసుకుని సంక్రాంతికి ఎట్టి పరిస్తితుల్లో రిలీజ్ చెయ్యాలని ఫిక్స్ చేసుకున్నారు మహేష్ అండ్ కో.

అక్కినేని హీరోలు నాగార్జున, అఖిల్ కూడా తమ సినిమాలకు సీజన్ సెట్ చేసుకుంటున్నారు. నాగార్జున ఘోస్ట్ మూవీ దసరాకి రిలీజ్ ప్లాన్ చేస్తుంటే, అఖిల్ కూడా తన సినిమాని విజయదశమికే తీసుకొద్దామనుకుంటున్నారు. ఇప్పటికే ఆగస్ట్ లో రిలీజ్ అనౌన్స్ చేసిన అఖిల్ ఏజెంట్ మూవీ ఇప్పుడు షూటింగ్ డిలేతో దసరాకి పోస్ట్ పోన్ అవుతోందని టాక్ నడుస్తోంది.