Statue Of Equality :108 దివ్యక్షేత్రాలు సందర్శిస్తే.. ప్రపంచాన్ని చుట్టేసినట్లే, సమతామూర్తి క్షేత్రంలోకి 2 గంటలు అనుమతి

దివ్యక్షేత్రంలో నిర్మించిన 108 దివ్య దేశాలను దర్శనం చేసుకుంటే...యావత్తు ప్రపంచంలోని అన్ని దేవాలయాలను దర్శించిన పుణ్యఫలం లభించినట్లేనని చిన్న జీయర్ స్వామిపీ ప్రవచించారు.

Statue Of Equality  :108 దివ్యక్షేత్రాలు సందర్శిస్తే.. ప్రపంచాన్ని చుట్టేసినట్లే, సమతామూర్తి క్షేత్రంలోకి 2 గంటలు అనుమతి

Statue Of Equality 108 దివ్యక్షేత్రాలు సందర

Samathamurthi Sahasrabdi Mahotsav : శ్రీ రామానుజ సహస్రాబ్ది వేడుకలు కొనసాగుతున్నాయి. 12 రోజుల పాటు ఈ వేడుకలను నిర్వహించనున్నారు. శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి నేతృత్వంలో ఈ మహా కార్యక్రమం జరుగుతోంది. 1035 హోమ గుండాలలో 5 వేల మంది రుత్విజులు హోమాలను నిర్వహిస్తున్నారు. ఈ మహత్తర వేడుకలను చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి భారీగా ప్రజలు తరలివస్తున్నారు. దీంతో ముచ్చింతల్ శ్రీరామనగరం ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోంది. 2022, ఫిబ్రవరి 07వ తేదీ సోమవారం ఆరో రోజు 108 దివ్య దేశాల ఉత్సవ మూర్తులకు (కొన్ని విగ్రహాలు) ప్రాణ ప్రతిష్ట చేశారు. దివ్యక్షేత్రంలో నిర్మించిన 108 దివ్య దేశాలను దర్శనం చేసుకుంటే…యావత్తు ప్రపంచంలోని అన్ని దేవాలయాలను దర్శించిన పుణ్యఫలం లభించినట్లేనని చిన్న జీయర్ స్వామిపీ ప్రవచించారు.

Read More : Severed Head Case: మెట్టు మహంకాళి తల, మొండం కేసు.. చిక్కని నిందితుల ఆచూకీ!

యాగశాలలో ఉన్న భక్తులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. దేవుడి ముందు అంతా సమానమేనని ప్రపంచానికి చాటి చెప్పిన జగద్గురు భగవద్రామానుజ చార్యులు. ఈయన స్పూర్తిని తరతరాలకు అందించాలనే కాంక్షతో ముచ్చింతల్ శ్రీరామనగరంలో 216 అడుగుల ఎత్తులో ఆయన బంగారు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీనిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లోకానికి అర్పించారు. ఐదో రోజు ఆదివారం కావడం, ఆపై సెలవు దినం కావడంతో ఈ ప్రాంతానికి భారీగా ప్రజలు తరలివచ్చారు. భక్తజనం పోటెత్తడంతో ఉత్సవాలు దేదీప్యమానంగా కొనసాగుతున్నాయి. శ్రీలక్ష్మీనారాయణుడి మహాయజ్ఞం ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగుతున్నాయి. ప్రతి రోజు కోటీ అష్టాక్షరీ మహామంత్ర జపం గంటన్నర పాటు చిన్నజీయర్ స్వామి స్వామి మంత్ర అనుష్టానం నిర్వహిస్తున్నారు. ఈ మంత్రాన్ని నిశబ్దంగా మనస్సులో స్మరిస్తున్నారు. ప్రవచన మండలంలో పండితులు, జీయర్లు ప్రవచనాలు ఇస్తున్నారు. సాయంత్రం సమయంలో సాంస్కృతిక కార్యక్రమలు నిర్వహిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు ఇచ్చిన ప్రదర్శనలు భక్తులను అలరిస్తున్నాయి.

Read More : Pawan Kalyan : హరీష్ శంకర్ నుంచి ‘భవదీయుడు భగత్ సింగ్’ అప్డేట్

మరోవైపు.. శ్రీ రామానుజ సహస్రాబ్ది వేడుకలకు ప్రముఖులు విచ్చేస్తున్నారు. ప్రముఖుల రాకపోకలప్పుడు పలు సమస్యలు ఏర్పడుతున్నాయి. దీంతో సమతామూర్తి క్షేత్రంలోకి భక్తులను అనుమతించే విషయంలో కొన్ని చర్యలు తీసుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. సోమ, మంగళవారాల్లో కేంద్ర మంత్రులు, ఇతరులు వస్తున్నారు. దీంతో ఆ సమయంలో భక్తులకు అనుమతించవద్దని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మిగతా సమయాల్లో నిత్యం 2 గంటల పాటు భక్తులను అనుమతించనున్నారు.