Sudigali Sudheer : జబర్దస్త్‌ని వదిలేస్తున్న సుధీర్ టీం.. కన్నీళ్లు పెట్టుకున్న రోజా.. షాక్ లో అభిమానులు..

తాజాగా వచ్చిన ప్రోమోలో సుధీర్ టీమ్ జబర్దస్త్ ని వీడుతున్నట్టు స్టేజి మీదే ప్రకటించారు. ఆ తర్వాత ముగ్గురు హగ్ చేసుకొని ఏడ్చేశారు స్టేజి మీదే. వీళ్ళు ఏడవడం చూసి రోజా.....

Sudigali Sudheer : జబర్దస్త్‌ని వదిలేస్తున్న సుధీర్ టీం.. కన్నీళ్లు పెట్టుకున్న రోజా.. షాక్ లో అభిమానులు..

Sudheer

Sudigali Sudheer :  తెలుగు బుల్లితెరపై కొన్నేళ్లుగా ప్రేక్షకులను నవ్విస్తున్న కామెడీ షో జబర్దస్త్. ఈ షో తరువాత వేరే చానళ్లలో ఇదే ఫార్మేట్ లో చాలా కామెడీ ప్రోగ్రామ్‌లు వచ్చినప్పటికీ దీని రేంజ్ కి ఏది చేరుకోలేదు. ఈ షోతో పాటు ఇందులోని కమెడియన్స్‌కు కూడా మంచి పేరు వచ్చింది. మొదట్లో వారానికి ఒక రోజు వచ్చిన ఈ షో అభిమానుల ఆదరణ బాగుండటంతో తర్వాత వారానికి రెండు రోజులు జబర్దస్త్‌, ఎక్స్‌ట్రా జబర్దస్త్‌ గా వస్తుంది. ఈ షోతో చాలా మంది కమెడియన్స్ పేరుతో పాటు డబ్బులు కూడా బాగా సంపాదించారు. అందులో ముఖ్యంగా సుడిగాలి సుధీర్‌ టీం. ఈ టీంలో సుధీర్, గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్, సన్నీ ఉంటారు. తాజాగా ఈ టీం జబర్దస్త్ ని వదిలేస్తున్నట్టు తెలుస్తుంది.

Sara Tendulkar : హీరోయిన్స్‌కి ఏ మాత్రం తీసిపోని సచిన్ కూతురు

వేణు టీంలో కంటెస్టెంట్స్ గా వచ్చి వాళ్ళ ట్యాలెంట్ తో, కష్టంతో సొంత టీమ్ గా ఎదిగారు ఈ ముగ్గురు. పర్సనల్ లైఫ్ లో కూడా వీళ్ళు ముగ్గురు మంచి స్నేహితులు. బుల్లితెరపై తమ కామెడీతో ఎంతోమంది అభిమానులని సంపాదించుకున్నారు. జబర్దస్త్ వచ్చిన ఫేమ్ తో వీరికి వేరే షోలతో పాటు సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. కానీ ఎన్ని అవకాశాలు వచ్చినా జబర్దస్త్ ని మాత్రం వీడలేదు. గతంలో చాలా సార్లు జబర్దస్త్ ని వీడము అని చెప్పారు. కానీ కొన్ని రోజుల నుండి వీళ్ళు జబర్దస్త్ ని వీడుతున్నారు అని ప్రచారం జరుగుతుంది. తాజాగా రిలీజ్ చేసిన ఎక్స్‌ట్రా జబర్దస్త్ ప్రోమో చూస్తే ఈ టీం నిజంగానే జబర్దస్త్ ని వీడుతున్నారు అని తెలుస్తుంది.

Sirivennela : సిరివెన్నెల కుటుంబాన్ని పరామర్శించిన గవర్నర్

ఒక పక్క జబర్దస్త్ చేస్తూనే, మరో పక్క వేరే షోలలో, సినిమాలలో కమెడియన్స్ గా, హీరోలుగా చేస్తున్నారు సుధీర్, శ్రీను, రామ్ ప్రసాద్. వీటి మధ్య ఒక్కోసారి జబర్దస్త్ షూటింగ్ కి డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోతున్నారని సమాచారం. అందుకే జబర్దస్త్ ని వీడుతున్నారని అనుకుంటున్నారు. తాజాగా వచ్చిన ప్రోమోలో సుధీర్ టీమ్ జబర్దస్త్ ని వీడుతున్నట్టు స్టేజి మీదే ప్రకటించారు. ఆ తర్వాత ముగ్గురు హగ్ చేసుకొని ఏడ్చేశారు స్టేజి మీదే. వీళ్ళు ఏడవడం చూసి రోజా కూడా ఏడ్చేసింది. దీంతో ఈ ప్రోమో వైరల్ అవుతుంది.

Jahnvi Kapoor : అలాంటి బట్టలు వేసుకోవడం.. ఇబ్బంది పడటం ఎందుకు?.. జాన్వీపై నెటిజన్స్ ట్రోల్..

అయితే సుధీర్ టీమ్ కోసమే జబర్దస్త్ చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సుధీర్ ఫ్యాన్ ఫాలోయింగ్ అలాంటింది. ఆ ఛానల్ లో వచ్చే ఈవెంట్స్ లో సుధీర్ కనపడకపోతే యూట్యూబ్ లో కామెంట్స్ చేస్తారు సుధీర్ కోసం. అలాంటిది సుధీర్ తో పాటు టీం మొత్తం వెళ్ళిపోతే జబర్దస్త్ కి ఇప్పుడు ఉన్నంత క్రేజ్ ఉంటుందా? టిఆర్పి తగ్గదా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సుధీర్ అభిమానులు నిరాశ చెందుతూ సుధీర్ ని వెళ్ళొద్దని ఈ ప్రోమో కింద కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాక రష్మీ, సుధీర్ ని వాడుకొని ఈవెంట్స్, స్కిట్స్ కూడా చేయలేరు. వీళ్లిద్దరి వల్లే టిఆర్పి వచ్చిన రోజులు ఉన్నాయి. మరి ఆ ఛానల్ కి బంగారు బాతు లాంటి సుధీర్ ని వదులుకోవడానికి వాళ్ళు ఇష్టపడతారా? లేక సుధీర్ తప్పదని వెళ్ళిపోతున్నాడా? లేదా సినిమాల కోసం వెళ్లి తర్వాత ఎప్పుడైనా మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉందా చూడాలి.