Suma: ‘జయమ్మ పంచాయితీ’ ప్రీరిలీజ్ బిజినెస్.. ఎంతో తెలుసా?

టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ కనకాల గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. టీవీ ఉన్న ప్రతిఒక్కరికీ సుమ సుపరిచితురాలే. అయితే ఇంతకాలం టీవీల్లో కనిపిస్తూ వచ్చిన సుమ..

Suma: ‘జయమ్మ పంచాయితీ’ ప్రీరిలీజ్ బిజినెస్.. ఎంతో తెలుసా?

Suma Jayamma Panchayathi Pre Release Business Details

Suma: టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ కనకాల గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. టీవీ ఉన్న ప్రతిఒక్కరికీ సుమ సుపరిచితురాలే. అయితే ఇంతకాలం టీవీల్లో కనిపిస్తూ వచ్చిన సుమ, రేపు (ఏప్రిల్ 6న) థియేటర్లలో సందడి చేయబోతుంది. సుమ లీడ్ రోల్‌లో నటించిన ‘జయమ్మ పంచాయితీ’ సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌కు రెడీ అయ్యింది. దర్శకుడు విజయ్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది చిత్ర యూనిట్.

Jayamma Panchayathi: స్టార్ హీరోలందరినీ వాడేస్తున్న జయమ్మ.. ఈసారి ఎవరంటే?

జయమ్మ పంచాయితీ చిత్రం కోసం స్టార్ హీరోలతో ప్రమోషన్స్ చేయించడంతో, ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి ప్రస్తుతం అందరిలో నెలకొంది. ఇక ఈ సినిమాపై కాన్ఫిడెంట్‌గా ఉన్న చిత్ర యూనిట్, రేపు హిట్టు కొట్టబోతున్నామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమాతో పాటు మరికొన్ని సినిమాలు కూడా బరిలో ఉండటంతో బాక్సాఫీస్ వద్ద పోటీ ఖాయమైంది. కాగా సుమ అనే బ్రాండ్‌తో పాటు సినిమా కథను నమ్మి ఈ సినిమా రైట్స్‌ను మంచి రేటుకు సొంతం చేసుకున్నారు డిస్ట్రిబ్యూటర్లు.

Jayamma Panchayathi : జయమ్మ కోసం ఇద్దరు అందగాళ్ళు

జయమ్మ పంచాయితీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.3.45 కోట్ల మేర ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. ఒక చిన్న చిత్రానికి ఇది మంచి అమౌంట్ అనే చెప్పాలి. అయితే బ్రేక్ ఈవెన్‌కు రావడం మాత్రం అంత ఈజీ కాదు అంటున్నారు సినీ ఎక్స్‌పర్ట్స్. మరి ‘జయమ్మ పంచాయితీ’కి ప్రేక్షకులు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి. ఇక ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ వివరాలు ఏరియాలవారీగా ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – 1.50 కోట్లు
సీడెడ్ – 0.50 కోట్లు
ఉత్తరాంధ్ర – 0.60 కోట్లు
ఈస్ట్ – 0.12 కోట్లు
వెస్ట్ – 0.10 కోట్లు
గుంటూరు – 0.18 కోట్లు
కృష్ణా – 0.15 కోట్లు
నెల్లూరు – 0.10 కోట్లు
ఏపీ+తెలంగాణ – 3.25 కోట్లు
రెస్టాఫ్ ఇండియా + ఓవర్సీస్ – 0.20 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ – రూ.3.45 కోట్లు