kharif Jowar Cultivation : ఖరీఫ్ జొన్న సాగులో మేలైన యాజమాన్యం

జొన్నఉత్పత్తులకు డిమాండ్ పెరగడం, ఎకరానికి 10 నుండి 15 క్వింటాళ్ల దిగుబడినిచ్చే అనేక  రకాలు, హైబ్రిడ్ లు,  రైతులకు అందుబాటులో ఉండటంతో  ఈ పంట సాగులో నూతనోత్సాహం కనిపిస్తోంది.

kharif Jowar Cultivation : ఖరీఫ్ జొన్న సాగులో మేలైన యాజమాన్యం

kharif Jowar Cultivation

Updated On : August 7, 2023 / 1:20 PM IST

kharif Jowar Cultivation : ఖరీఫ్ లో వర్షాధారంగా పండే పంటల్లో జొన్న ముఖ్యమైనది. ప్రస్తుతం ఆరోగ్యరిత్య ప్రజల్లో జొన్న ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఏర్పడింది.  దీన్ని ఆసరాగా చేసుకొని కొంత మంది రైతులు జొన్నపంటను విత్తారు.. అయితే వర్షాలు ఆలస్యం కావడంతో మరి కొంత మంది ఇప్పుడిప్పుడే విత్తుతున్నారు.. అయితే తక్కువ కాలంలో  అధిక దిగుబడులను ఇచ్చే జొన్నరకాలతో పాటు  సాగులో పాటించాల్సిన యాజమాన్య పద్ధతులను గురించి  తెలియజేస్తున్నారు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డా. మహేశ్వరమ్మ.

READ ALSO : Cattle Nutrition : అధిక పాల దిగుబడి కోసం నాణ్యమైన పోషణ

ఒకప్పుడు జొన్నసాగు అధిక విస్తీర్ణంలో సాగయ్యేది. రాను రాను వ్యవసాయంలో వ్యాపార దృక్పధం పెరగటం, తక్కువ దిగుబడుల వల్ల సాగు గిట్టుబాటుకాకపోవటం.. రైతులు  జొన్న పంటకు దూరమవుతూ వచ్చారు. కానీ  ప్రస్తుతం పరిస్థితులు మారాయి. జొన్నఉత్పత్తులకు డిమాండ్ పెరగడం, ఎకరానికి 10 నుండి 15 క్వింటాళ్ల దిగుబడినిచ్చే అనేక  రకాలు, హైబ్రిడ్ లు,  రైతులకు అందుబాటులో ఉండటంతో  ఈ పంట సాగులో నూతనోత్సాహం కనిపిస్తోంది.

READ ALSO : Castor Cultivation : ఖరీఫ్ కు అనువైన ఆముదం రకాలు

అంతే కాదు మార్కెట్ లో జొన్న ధర కూడా బాగుండటంతో ఈ ఏడాది ఖరీఫ్ జొన్నను కొంత మంది విత్తారు. కానీ వర్షాలు ఆలస్యం కావడంవల్ల.. అక్కడక్కడ ఇప్పుడిప్పుడే విత్తుతున్నారు. జొన్నలో అధిక దిగుబడులు సాధించాలంటే రకాల ఎంపికతో పాటు మేలైన యాజమాన్యం చేపట్టాలని రైతులకు సూచిస్తున్నారు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డా. మహేశ్వరమ్మ.

READ ALSO : Chilli Cultivation : మిరప నార్లు పోస్తున్న రైతులు.. నాణ్యమైన నారుకోసం పాటించాల్సిన యాజమాన్యం

జొన్నకు కీలక దశలో నీటి తడులను అందించాలి. ఆలస్యంగా విత్తిన పైరుల్లో తొలిదశలో మొవ్వుతొలుచు ఈగ, కాండం తొలుచు పురుగులు ఆశిస్తాయి. చివరిదశలో  బూజు తెగుళ్ల ఆశించి పంటకు తీవ్ర నష్టం చేస్తాయి. సకాలంలో వీటిని గమనించి అరికట్టినట్లైతే నాణ్యమైన దిగుబడులను పొందవచ్చు