Watermelon Cultivation : పుచ్చసాగులో మేలైన యాజమాన్యం

పుచ్చ ప్రారంభంలో నీటి అవసరం ఎక్కువగా వున్నా కాయ తయారయ్యే దశలో ఎక్కువ నీరు అందించకూడదు. నీరు ఎక్కువైతే కాయపగుళ్లు సంభవిస్తాయి. బోరాన్ లోపం వల్ల కూడా కాయలు పగిలే అవకాశం వుంటుంది. అందువల్ల పుచ్చ పాదులు 2 నుంచి 4ఆకుల దశలో  1 గ్రాము బోరాక్స్ ను లీటరు నీటికి కలిపి పిచికారిచేస్తున్నారు.

Watermelon Cultivation : పుచ్చసాగులో మేలైన యాజమాన్యం

Watermelon Cultivation

Updated On : April 13, 2023 / 10:59 PM IST

Watermelon Cultivation : మండే ఎండల్లో దప్పికను తీర్చి, శరీరాన్ని చల్లబరచే మృదు, మధురమైన పండు పుచ్చ. పుచ్చకాయను కళింగర, తర్బూజా అని కూడా పిలుస్తారు. శరీరాన్ని చల్లబర్చటమే కాదు,  ఆరోగ్యానికి మేలు చేసే అనేక గుణాలు పుచ్చ పండు సొంతం. అందువల్ల వేసవిలో పుచ్చకాయలకు యమ డిమాండ్ వుంటుంది.  తెలుగు రాష్ట్రాల్లో తేలిక నేలలు, ఒండ్రు కలిగిన ఇసుక నేలల్లో పుచ్చను అధికంగా సాగుచేస్తున్నారు.

READ ALSO : Bengal Gram : శనగపంటలో తెగుళ్ళ వ్యాప్తి, నివారణ

సాధారణంగా వేసవిని దృష్టిలో పెట్టుకుని పుచ్చను విత్తుతారు. ఈ పంటకు  సంవత్సరమంతా డిమాండ్ వుండటంతో  రైతులు అన్ని సీజన్ లలోనూ సాగుచేస్తున్నారు. అయితే అధిక దిగుబడిని పొందాలంటే , నాణ్యమైన విత్తనంతో పాటు, మేలైన యాజమాన్యం చేపట్టాలి.

ఈ గిరాకీని అందిపుచ్చుకునేందుకు  చాలా మంది  రైతులు దఫ దఫాలుగా పుచ్చను సాగుచేస్తున్నారు.  అయితే ఈ పంటకు వైరస్ అధికంగా ఆశిస్తుండటంతో, రైతులు రసాయన మందులను అధికంగా వాడుతున్నారు.  దీనివల్ల పండ్ల నాణ్యత తగ్గిపోయి ఆశించిన ఫలితాలు పొందలేక పోతున్నారు. కాబట్టి పుచ్చసాగులో నాణ్యమైన అధిక దిగుబడులు పొందాలంటే, సకాలంలో యాజమాన్య చర్యలు చేపట్టాల్సి ఉంటుంది.

READ ALSO : Pomegranate Cultivation : దానిమ్మ సాగులో కొమ్మ కత్తిరింపులు, పూత,నియంత్రణలో యాజమాన్యం!

పుచ్చ ప్రారంభంలో నీటి అవసరం ఎక్కువగా వున్నా కాయ తయారయ్యే దశలో ఎక్కువ నీరు అందించకూడదు. నీరు ఎక్కువైతే కాయపగుళ్లు సంభవిస్తాయి. బోరాన్ లోపం వల్ల కూడా కాయలు పగిలే అవకాశం వుంటుంది. అందువల్ల పుచ్చ పాదులు 2 నుంచి 4ఆకుల దశలో  1 గ్రాము బోరాక్స్ ను లీటరు నీటికి కలిపి పిచికారిచేస్తున్నారు.

చలివాతావరణంలో  బూడిద తెగులు సోకకుండ, ముందుజాగ్రత్తగా  1మిల్లీ లీటరు ట్రైడిమార్ఫ్ లేదా 1మిల్లీలీటరు డైనోకాప్ ను లీటరు నీటికి కలిపి పిచికారిచేయాలి. తక్కువ కాల పరిమితి గల పుచ్చ రకాల్లో  విత్తిన 20రోజులకు పూత మొదలవుతుంది. 30రోజులనుంచి కాయ ఏర్పడటం మొదలవుతుంది. 50వ రోజు నుంచి కాయకోత మొదలవుతుంది. కాబట్టి శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటిస్తే మంచి దిగుబడులు పొందేందుకు ఆస్కారం ఉంటుందని కరీనంగర్‌జిల్లా, జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత జి. వేణుగోపాల్ తెలియజేస్తున్నారు.

READ ALSO : Green Malta farming : బత్తాయి సాగులో యాజమాన్య పద్ధతులు !