Sushant Singh Rajput : రియల్ లైఫ్‌లో ఎందుకు హీరో కాలేకపోయాడు..?

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్.. ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకపోయినా బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు..

Sushant Singh Rajput : రియల్ లైఫ్‌లో ఎందుకు హీరో కాలేకపోయాడు..?

Sushant Singh Rajput

Sushant Singh Rajput: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్.. ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకపోయినా బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. సరిగ్గా ఏడాది క్రితం.. 34 ఏళ్లకే నూరేళ్ల ఆయుష్షు తీరిపోయిందంటూ సుశాంత్‌ను మృత్యువు తీసుకెళ్లిపోయింది.

నేటితో (జూన్ 14) సుశాంత్ మరణించి సంవత్సరం పూర్తవుతుంది. సుశాంత్ నటనను, అతను అద్భుతంగా యాక్ట్ చేసిన సినిమాలను గుర్తు చేసుకుంటూ సన్నిహితులు, అభిమానులు నివాళులర్పిస్తున్నారు.

సుశాంత్ 2008 లో టీవీ నటుడిగా ఇంట్రడ్యూస్ అయ్యాడు. 2013 లో కోటి కలలతో హిందీ చిత్రసీమలోకి అడుగు పెట్టాడు. ‘కై పో చే’, ‘శుద్ధ్ దేశీ రొమాన్స్’, ‘పీకే’, ‘ఎం.ఎస్. ధోని : ది అన్‌టోల్డ్ స్టోరీ’, ‘రాబ్తా’, ‘కేదార్ నాథ్’, ‘చిచ్చోరే’, ‘దిల్ బెచారా’ వంటి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. మంచి టాలెంట్, ఎంతో చక్కని భవిష్యత్తు కలిగిన సుశాంత్ ఇలా అర్థాంతరంగా తనువు చాలించడం బాధాకరం.

Read>>>>Sushant Singh Rajput’s మైనపు విగ్రహం