పాదాల వాపులా? కిడ్నీల పనితీరు సరిగా లేకపోవటమే కారణమా?

ముఖ్యంగా రక్త పోటులో వ్యత్యాసం, కిడ్నీల సమస్య, గుండె పనితీరు మెరుగ్గా లేకుంటేనే పాదాల వాపులు వస్తాయని గుర్తుంచుకోవాలి. పాదాలు వాస్తే కిడ్నీ పనితీరు సరిగ్గా లేకపోవడమో, గుండె ఆరోగ్యం బాలేదనో అర్థం చేసుకుని వైద్యుడిని సంప్రదించి వాటికి సంబంధించి పరీక్షలు చేయించుకోవాలి.

పాదాల వాపులా? కిడ్నీల పనితీరు సరిగా లేకపోవటమే కారణమా?

Swollen feet? Is it due to poor kidney function?

పాదాల వాపునకు సర్వ సాధారణమైన కారణం ఎక్కువ సేపు కూర్చొని ఉండటమే. గురుత్వాకర్షణ శక్తి వల్ల శరీరంలోని నీరు పాదాల్లోకి చేరుతుంది. అటు ఇటు కలదకుండా కూర్చోడమే దీనికి కారణం. ఏ వయసు వారికైనా ఈ వాపులు రావడం సహజమే. దీనివల్ల పెద్దగా ప్రమాదకరమేమీ ఉండదు. చీలమండల్లో కూడా ఎక్కువ సేపు కూర్చుంటే వాపులు వస్తాయి. ఇవన్నీ కాసేపు నడిస్తే తగ్గిపోతాయి. నొప్పి లేకుండా కేవలం వాపు ఉండటం వల్ల చాలా మంది దీన్ని తేలికగా తీసుకుంటారు. అయితే, అన్ని వాపులను తేలికగా తీసుకోవద్దని, శరీరంలోని మరో సమస్యకు ఈ వాపులు సంకేతమని వైద్యులు చెబుతున్నారు.

ముఖ్యంగా రక్త పోటులో వ్యత్యాసం, కిడ్నీల సమస్య, గుండె పనితీరు మెరుగ్గా లేకుంటేనే పాదాల వాపులు వస్తాయని గుర్తుంచుకోవాలి. పాదాలు వాస్తే కిడ్నీ పనితీరు సరిగ్గా లేకపోవడమో, గుండె ఆరోగ్యం బాలేదనో అర్థం చేసుకుని వైద్యుడిని సంప్రదించి వాటికి సంబంధించి పరీక్షలు చేయించుకోవాలి. వాటి పనితీరు మెరుగ్గా ఉందో లేదో నిర్దారించుకోవడం చాలా ముఖ్యం. న్యూరో సంబంధిత సమస్యల కారణంగా పాదాల్లో ఉండే చిన్న నాడులు పని చేయవు. డయాబెటిస్‌తో బాధపడే వారిలో ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. శరీరంలో లవణాలు అధికంగా ఉంటే కూడా పాదాలు వాపు వస్తుంది. నీళ్లను అధికంగా తాగుతూ ఉంటే ఈ అధిక లవణాల సమస్య తగ్గుతుంది.

ప్రెగ్నెన్సీ టైంలో శరీరంలో జరిగే మార్పుల వల్ల కాళ్లలో వాపులు కూడా వస్తాయి. ఈ సమయంలో గర్భిణులు చాలా జాగ్రత్తగా ఉండాలి. సరైన వ్యాయామం లేకపోతే వారికి వెరికోస్ వీన్స్ అనే రక్తనాళాల సంబంధిత సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న వ్యాయామం, నడక వల్ల ఈ వాపులు తగ్గుతాయి. అందుకే పని చేస్తున్నా మధ్య మధ్యలో కాస్త దూరం నడవడం మంచిది. పాదాలకు బ్లడ్ సర్క్యూలేషన్ మెరుగ్గా లేకుంటే వాపులు వస్తాయి.