New Labour Codes: 1 నుంచి కొత్త కార్మిక చట్టాల అమ‌లు?.. వేత‌నం, పీఎఫ్‌, ప‌నిగంటల్లో భారీ మార్పులు

దేశంలో కొత్త కార్మిక చట్టాలను జూలై 1 నుంచి అమలు చేయడానికి కేంద్ర ప్ర‌భుత్వం సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది. ఈ మేరకు వాటిని అమ‌లు చేయ‌డానికి ప‌లు రాష్ట్రాలు స‌న్నాహాలు చేసుకుంటున్నాయి.

New Labour Codes: 1 నుంచి కొత్త కార్మిక చట్టాల అమ‌లు?.. వేత‌నం, పీఎఫ్‌, ప‌నిగంటల్లో భారీ మార్పులు

Labour Laws

New Labour Codes: దేశంలో కొత్త కార్మిక చట్టాలను జూలై 1 నుంచి అమలు చేయడానికి కేంద్ర ప్ర‌భుత్వం సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది. ఈ మేరకు వాటిని అమ‌లు చేయ‌డానికి ప‌లు రాష్ట్రాలు స‌న్నాహాలు చేసుకుంటున్నాయి. కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొస్తున్న ఈ నాలుగు కొత్త కార్మిక చ‌ట్టాల ద్వారా అనేక నిబంధ‌న‌లు మార‌నున్నాయి. కార్మికుల సామాజిక భ‌ద్ర‌త‌కు వీటి ద్వారా కేంద్ర ప్ర‌భుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. ఉద్యోగి వేత‌నం, పీఎఫ్ వాటా, ప‌ని గంట‌ల్లో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి.

Maharashtra: రెబ‌ల్ ఎమ్మెల్యేల‌కు మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్ లేఖ‌

కొత్త కార్మిక చట్టాల గురించి కొంద‌రు నిపుణులు ప‌లు విష‌యాల‌ను విశ్లేషించి తెలిపారు. ఉద్యోగి రోజుకి 12 గంట‌లు ప‌నిచేసి, వారానికి మూడు రోజులు సెల‌వులు తీసుకునే వెసులుబాటు ఉంటుంది. ఇప్ప‌టివ‌ర‌కు ఉద్యోగి రోజుకి 8 గంట‌ల చొప్పున‌ వారానికి 48 గంట‌లు కార్యాల‌యాల్లో ప‌నిచేసేవాడు. జూలై 1 నుంచి కూడా వారానికి 48 గంట‌లే ప‌నిచేయాల్సి ఉంటుంది. ఇందులో ఎలాంటి మార్పు ఉండ‌దు. అయితే, అవ‌స‌రం అనుకుంటే ఆ ప‌నిగంట‌ల‌ను నాలుగు రోజుల్లో (రోజుకు 12 గంట‌ల చొప్పున‌) పూర్తి చేసుకుని మిగ‌తా మూడు రోజులు సెల‌వులు తీసుకునే అవ‌కాశం జూలై 1 నుంచి ఉంటుంది.

Maharashtra: ఢిల్లీకి చేరిన మహారాష్ట్ర రాజకీయాలు.. 50 మంది ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు ఉంద‌న్న ఏక్‌నాథ్‌

అయితే, వారానికి 48 గంట‌ల కంటే ఎక్కువ‌గా ప‌నిచేసే ఉద్యోగికి కార్యాల‌యాలు ఓవ‌ర్ టైమ్ రెండు రెట్లు ఇవ్వాలి. కొత్త కార్మిక చ‌ట్టాల ద్వారా మారే మ‌రో కీల‌క అంశం చేతికి అందే వేత‌నం. ఉద్యోగ భ‌విష్య‌నిధి వాటా, వేత‌నం నిష్ప‌త్తి మ‌ధ్య భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఉద్యోగి స్థూల వేత‌నంలో అత‌డి మూల వేత‌నం 50 శాతం ఉండాలి. దీంతో ఉద్యోగి పీఎఫ్ వాటా పెరిగి, అత‌డికి చేతికి అందే వేత‌నం త‌గ్గ‌నుంది. ఉద్యోగి ప‌ద‌వీ విర‌మ‌ణ స‌మ‌యంలో అత‌డికి భారీగా ల‌బ్ధి చేకూర‌నుంది.