Zomato 10Min Delivery : ‘10 నిమిషాల్లో ఫుడ్ డెలివరీ ఎలా చేస్తారో మాకు చెప్పాలి’ ‘జొమోటో’కు పోలీసుశాఖ నోటీసులు

‘10 నిమిషాల్లో ఫుడ్ డెలవరీ ఎలా చేస్తారో మాకు చెప్పాలి’ అంటూ ‘జొమోటో’కు పోలీసుశాఖ నోటీసులు జారీ చేసింది.

Zomato 10Min Delivery : ‘10 నిమిషాల్లో ఫుడ్ డెలివరీ ఎలా చేస్తారో మాకు చెప్పాలి’ ‘జొమోటో’కు పోలీసుశాఖ నోటీసులు

Police Issues Notice To Zomato For 10min Delivery

Police Issues Notice To Zomato For 10Min Delivery : జొమాటో 10నిమిషాల్లో ఫుడ్ డెలివరీ చేస్తామంటూ అనౌన్స్ చేసింది. జొమాటో ఫౌండర్ దీపిందర్ గోయెల్ ట్విట్టర్ వేదికగా కొత్త ఫీచర్ ను అందుబాటులోకి వచ్చిందని ప్రకటించారు. ‘జొమాటోలో పది నిమిషాల్లో ఫుడ్ డెలివరీ ఫీచర్ రానుంది’ అని ట్వీట్ చేశారు. ఈ ప్రాసెస్‌ను జొమాటో ఇన్‍‌స్టంట్ అని పేరు పెట్టారు. దీనిపై చెన్నై పోలీసులు కన్నెర్ర చేశారు. వినియోగదారుడు ఆర్డర్ ఇచ్చిన కేవలం 10 నిమిషాల్లో ఫుడ్ డెలివరీ ఎలా చేస్తారు? ఎలా చేయగలరు? ఇది సాధ్యమేనా? సాధ్యమైతే అది ఎలాగో తమకు తెలియజేయాలి..(వివరణ ఇవ్వాలి) అంటూ చెన్నై ట్రాఫిక్ పోలీసులు జొమాటో సంస్థకు గురువారం (మార్చి 24,2022) నోటీసులు జారీ చేశారు.

Also read : Zomato App: పది నిమిషాల్లో ఫుడ్ డెలివరీ..

వినియోగదారుడు ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేస్తే..ఆయా రకాల ఆహార పదార్థాలను జొమోటో డెలివరీ బాయ్స్ ఇళ్లు, కార్యాలయాలు ఇలా ఎక్కడికైనా సరే తీసుకెళ్లి అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ రంగంలో కూడా పోటీ వచ్చేసింది. ఇటువంటి పోటీని తట్టుకుని తమకంటూ ఓ ప్రత్యేకను క్రియేట్ చేయటానికి..వినియోగదారుడికి మరింతగా దగ్గర అవ్వటానికి జొమాటో తాజాగా ఆర్డర్ ఇచ్చిన 10 నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ చేస్తాం అంటూ ప్రకటించింది.

Also read : Hyderabad Irani Chai : రష్యా-యుక్రెయిన్‌ యుద్ధం..హైదరాబాద్ లో భారీగా పెరిగిన ఇరానీ చాయ్‌ ధరలు..!

కేవలం పది నిమిషాల్లో ఎలా డెలివరీ చేస్తారు? చెన్నై, హైదరాబాద్, కలకత్తా వంటి నగరాల్లో అయితే, ఇది అసాధ్యమన్న సంకేతాలు కూడా వినిపించాయి. 10 నిమిషాల్లో వినియోగ దారుడికి ఆహార పదార్థాలు అందించాల్సి ఉండటంతో, ఆ ప్రతినిధులు తమ వాహనాల్లో అతివేగంగా డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఏమాత్రం సరైందికాదు. అలా వేగంగా వెళ్లాలి అంటే ట్రాఫిక్‌ నిబంధనల్ని అతిక్రమించక తప్పదు. సిగ్నల్స్ జంపింగ్, ఫాస్టు డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది. దీనిని పరిగణలోకి తీసుకున్న చెన్నై ట్రాఫిక్‌ పోలీసు వర్గాలు 10 నిమిషాల్లో ఫుడ్ డెలివరీ ఎలా చేస్తారో మాకు వివరణ ఇవ్వాలి అంటూ జొమోటో సంస్థకు నోటీసులు జారీ చేశాయి. పది నిమిషాల్లో ఎలా ఫుడ్‌ సరఫరా చేస్తారో అనే విషయంపై సమగ్ర వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ ఈ నోటీసులు జారీ చేశారు.