Hyderabad Irani Chai : రష్యా-యుక్రెయిన్‌ యుద్ధం..హైదరాబాద్ లో భారీగా పెరిగిన ఇరానీ చాయ్‌ ధరలు..!

రష్యా-యుక్రెయిన్‌ యుద్ధం ప్రభావంతో హైదరాబాద్ లో ఇరానీ చాయ్‌ ధరలు భారీగా పెరిగాయి.

Hyderabad Irani Chai : రష్యా-యుక్రెయిన్‌ యుద్ధం..హైదరాబాద్ లో భారీగా పెరిగిన ఇరానీ చాయ్‌ ధరలు..!

Hyderabad Irani Chai To Cost Rs 5 Extra From March 25

Hyderabad Irani Chai to Cost Rs 5 Extra From March 25 : హైదరాబాద్ అంటే విభిన్న రుచులకు ఆలవాలం. ముఖ్యంగా ఇరానీ చాయ్ తాగాలంటే హైదరాబాద్ లోనే తాగాలి అనేంత రుచి ఇక్కడి ప్రత్యేకత. ఇరానీ చాయ్ ఒక్క సిప్ గొంతులో దిగితే ఆ మజాయే వేరప్పా..అనేవారికి ఈ వార్త చేదువార్త అనే చెప్పాలి. ఎందుకంటే జంటనగరాల్లో ఇరానీ చాయ్ ధరలు పెరిగాయి. భారీగా పెరిగాయి. ఒక కప్పు ఛాయ్‌పై ఏకంగా రూ. 5 పెరిగింది. దీనికి సంబంధించి ఆయా హోటల్‌ యాజమాన్యాలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరతో ఇరానీ చాయ్‌ రూ. 15 నుంచి రూ. 20కు చేరింది. పెరిగిన ధరలు నిన్నటింనుంచే అంటే మార్చి 25 నుంచే అమలులోకి వచ్చాయి.

Also read :  Russia ukraine war : రష్యాతో పోరాటానికి రోజు 1000 ఆయుధాలు సరఫరా చేయాలని అమెరికాకు జెలెన్ స్కీ డిమాండ్

ధరల పెంపుకు కారణమైన ఇంధన ధరల పెంపు..!
రష్యా-యుక్రెయిన్‌ యుద్ధమేమో గానీ హైదరాబాద్ లో ఇరానీ చాయ్ ధరలు పెరగాయి. ఈ రెండు దేశాలమధ్యా యుద్ధం నెల రోజుల నుంచి కొనసాగుతోంది. దీనికి ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుందో తెలియని పరిస్థితి. ఈ యుద్ధ ప్రభావం కాస్తా..భారత్ పై బాగానే పడుతోంది. ఇప్పటికే వంటనూనెల ధరలు భారీగా పెరిగాయి. తాజాగా హైదరాబాద్ లో ఇరానీ చాయ్ ధరలు కూడా భారీగా పెరిగాయి.

రష్యా-యుక్రెయిన్ వార్ కొనసాగుతున్న క్రమంలో క్రూడాయిల్‌ ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. క్రూడాయిల్‌ ధరల ప్రభావం అన్ని రంగాలపై పడింది. ఇప్పటికే ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు ప్యాకేజ్డ్‌ వస్తువులను భారీగా పెంచాయి. ఇక ద్రవ్యోల్భణ ఒత్తిళ్లను అధిగమించడానికి మరోమారు 10-15 శాతం వరకు ధరలను పెంచేందుకు ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు సిద్దమైన్నాయి.

Also read :  Ukraine Russia war: యుద్ధం కాదు, సహాయంపై నాటో స్పందించకపోవడమే దారుణ విషయం: జెలెన్స్కీAlso read :

దీంతో ఇరానీ టీ పొడి ధర కిలో రూ.300నుంచి రూ.500కు చేరింది. ఇకపోతే పాల ధరలు ఆమధ్య ఎప్పుడో పెరగనే పెరిగాయి. పాలు లీటరుకు రూ.100కు చేరింది. ఇక కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్ ధర రూ. 1,800కు చేరుకునే అవకాశం ఉంది. హోటళ్లలో ఇతరత్రా ఖర్చులు పెరిగిన క్రమంలో ఇరానీ ఛాయ్‌ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు ఆయా హోటల్స్ యాజమాన్యాలు.

కాగా కరోనాకు ముందు కరోనా తరువాత అన్నట్లుగా మారిపోయిన ధరలు క‌రోనాకు ముందు ఒక క‌ప్పు ఇరానీ చాయ్ ధ‌ర రూ.10 ఉండేది ఇప్పుడు ఏకంగా..రూ.20కు చేరింది. ఇది యుద్ధ ప్రభావమేనంటున్నారు హోటల్ యాజమనులు. ఇదెలా ఉందంటే ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చింది అన్నట్లుగా ఉంది. రష్యా-యుక్రెయిన్ యుద్ధం కాస్తా భారత్ లో పలు వస్తువుల ధరలు భారీ పెరగటంతో సామాన్యలు నానా పాట్లు పడుతున్నారు. ఆర్థిక భారం పెరగటంతో ఇబ్బందులకు గురి అవుతున్నారు.