Online Rummy: ఆన్‌లైన్ రమ్మీ గేమ్స్‌పై తమిళనాడు ప్రభుత్వం ఆర్డినెన్స్

ఆన్‌లైన్ గేమ్స్ మనుషుల ప్రాణాలు తీస్తున్నాయి. ఆస్తులూ కొల్లగొడుతున్నాయి. గేమ్స్ ఆడుతూ కొందరు లక్షల్లో డబ్బు పోగొట్టుకుంటుంటే, ఇంకొందరు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అందులోనూ ఆన్‌లైన్ రమ్మీ గేమ్‌కు అలవాటైతే బోలెడంత డబ్బు పోగొట్టుకోవాల్సి వస్తుంది.

Online Rummy: ఆన్‌లైన్ రమ్మీ గేమ్స్‌పై తమిళనాడు ప్రభుత్వం ఆర్డినెన్స్

Online Rummy

Online Rummy: ఆన్‌లైన్ గేమ్స్ మనుషుల ప్రాణాలు తీస్తున్నాయి. ఆస్తులూ కొల్లగొడుతున్నాయి. గేమ్స్ ఆడుతూ కొందరు లక్షల్లో డబ్బు పోగొట్టుకుంటుంటే, ఇంకొందరు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అందులోనూ ఆన్‌లైన్ రమ్మీ గేమ్‌కు అలవాటైతే బోలెడంత డబ్బు పోగొట్టుకోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు బాధితులు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ రమ్మీ గేమ్స్‌పై నిషేధం విధించేందుకు సిద్ధమైంది తమిళనాడు ప్రభుత్వం. ఈ గేమ్ నిషేధిస్తూ ఆర్డినెన్స్ తేవాలని నిర్ణయించింది. గత గురువారం రాత్రి భువనేశ్వరి అనే 32 ఏళ్ల మహిళ చెన్నైలో ఆత్మహత్యకు పాల్పడింది.

Child Reunited: ఆసుపత్రిలో బిడ్డ తారుమారు.. మూడేళ్లకు తల్లిందండ్రుల చెంతకు

దీనికి కారణం ఉద్యోగం లేని ఆమె భర్త ఆన్‌లైన్ రమ్మీ గేమ్‌ ఆడి రూ.20,000 పోగొట్టడటమే. ఆ డబ్బును భువనేశ్వరి తన కొడుకు స్కూల్ ఫీజు కోసం దాచుకుంది. అయితే, భర్త రమ్మీ గేమ్ ఆడి డబ్బు పోగొట్టడంతో, దిక్కుతోచని భువనేశ్వరి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో ప్రభుత్వం స్పందించింది. ఆన్‌లైన్ రమ్మీ గేమ్‌కు వ్యతిరేకంగా ఆర్డినెన్స్ తేవాలని నిర్ణయించింది. దీనికోసం రిటైర్డ్ జస్టిస్ చంద్రు ఆధ్వర్యంలో నలుగురు సభ్యులతో ఒక కమిటీ ఏర్పాటు చేసింది. రెండు వారాల్లోగా ఈ కమిటీ తగు సూచనలతో నివేదిక అందజేయనుంది. ఆ తర్వాత ఆర్డినెన్స్ ద్వారా ఆన్‌లైన్ రమ్మీ గేమ్స్‌పై నిషేధం విధిస్తారు.