Tamil Nadu : కరోనాని జయించిన కొద్ది రోజులకే పన్నీరు సెల్వం తమ్ముడు మృతి

అన్నాడీఎంకే నేత, తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం తమ్ముడు బాలమురుగన్(56)మృతిచెందారు.

Tamil Nadu : కరోనాని జయించిన కొద్ది రోజులకే పన్నీరు సెల్వం తమ్ముడు మృతి

Balamurugan

Balamurugan : అన్నాడీఎంకే నేత, తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం తమ్ముడు బాలమురుగన్(56)మృతిచెందారు. కొంతకాలంగా క్యాన్సర్ తో భాధపడుతున్న బాలమురుగన్ శుక్రవారం ఉదయం స్వస్థలం థేని జిల్లాలోని పెరియాకుళంలో కన్నుమూశారు. బాలమురుగన్ కి భార్య,పదో తరగతి చదువుతున్న కూతురు ఉన్నారు.

కొద్ది నెలల క్రితం వరకు తిరువనంతపురంలోబాలమురుగన్ క్యాన్సర్ ట్రీట్మెంట్ పొందారు. గత నెలలో ఆయన కరోనా బారినపడగా..ఇంట్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకొని కరోనా నుంచి కోలుకున్నారు. కరోనాని జయించిన కొద్ది రోజులకే ఆయన మరణం పన్నీర్ సెల్వం కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. సోదరుడి మృతి పట్ల పళనిస్వామి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చెన్నైలో ఉన్న ఆయన సోదరుడి మరణవార్త తెలియగానే కుటుంబంతో కలిసి ప్రత్యేక విమానంలో మధురై చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గంలొ పెరియాకుళం వెళ్లారు. ;పన్నీరుసెల్వం ముగ్గురు తమ్ముళ్లలో..బాలమురుగన్ రెండోవాడు.

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ బాలమురుగన్ మృతిపట్ల సంతాపం తెలిపారు. పన్నీర్ సెల్వంతో ఫోన్లో మాట్లాడారు. మాజీ సీఎం పళనిస్వామి కూడా బాలమురుగన్ మృతి పట్ల సంతాపం తెలిపారు. బాలమురుగన్ ఒక రైతుగానే సాధరణంగా జీవించేవాడని,పాలిటిక్స్ లో పెద్దగా యాక్టివ్ గా ఉండేవాడు కాదని అయితే కొన్ని సమయాల్లో తన అన్నకి రాజకీయాల్లో చేదోడువాదోడుగా ఉండేవాడని అన్నాడీఎంకే వర్గాలు తెలిపాయి. కాగా,2018లో మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా రక్షణ మంత్రిత్వ శాఖ నుండి ప్రత్యేక అనుమతి పొందిన భారతీయ వైమానిక దళ విమానం AN-32 లో మదురై నుండి చెన్నైకి బాలమురుగన్ ని తరలించారు. దీని కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి పన్నీరుసెల్వం 14.91లక్షల రూపాయలు చెల్లించారు.