Telangana Budget session: ‘పుట్టుక నీది.. చావు నీది.. బ‌తుకంతా దేశానిది’ అంటూ కాళోజీ వాక్కుల‌తో త‌మిళిసై ప్ర‌సంగం ప్రారంభం

తెలంగాణ గవర్నర్ త‌మిళిసై ప్ర‌సంగంతో రాష్ట్ర‌ బడ్జెట్ సెషన్ ప్రారంభమైంది. 'పుట్టుక నీది.. చావు నీది.. బ‌తుకంతా దేశానిది' అని కాళోజీ చెప్పిన మాట‌ల‌ను గుర్తు చేస్తూ త‌మిళిసై త‌న‌ ప్ర‌సంగాన్ని ప్రారంభించారు. ప్ర‌జ‌ల నుంచి వ‌స్తున్న మ‌ద్ద‌తు, ముఖ్యమంత్రి స‌మ‌ర్థ‌వంత‌మైన పాల‌న వ‌ల్ల, ప్ర‌జాప్ర‌తినిధుల కృషి, ఉద్యోగుల నిబ‌ద్ధ‌త వ‌ల్ల రాష్ట్ర‌ అభివృద్ధి సాధ్య‌మ‌వుతోంద‌ని చెప్పారు.

Telangana Budget session: ‘పుట్టుక నీది.. చావు నీది.. బ‌తుకంతా దేశానిది’ అంటూ కాళోజీ వాక్కుల‌తో త‌మిళిసై ప్ర‌సంగం ప్రారంభం

Telangana Budget session

Telangana Budget session: తెలంగాణ గవర్నర్ త‌మిళిసై ప్ర‌సంగంతో రాష్ట్ర‌ బడ్జెట్ సెషన్ ప్రారంభమైంది. ‘పుట్టుక నీది.. చావు నీది.. బ‌తుకంతా దేశానిది’ అని కాళోజీ చెప్పిన మాట‌ల‌ను గుర్తు చేస్తూ త‌మిళిసై త‌న‌ ప్ర‌సంగాన్ని ప్రారంభించారు. ప్ర‌జ‌ల నుంచి వ‌స్తున్న మ‌ద్ద‌తు, ముఖ్యమంత్రి స‌మ‌ర్థ‌వంత‌మైన పాల‌న వ‌ల్ల, ప్ర‌జాప్ర‌తినిధుల కృషి, ఉద్యోగుల‌ నిబ‌ద్ధ‌త వ‌ల్ల రాష్ట్ర‌ అభివృద్ధి సాధ్య‌మ‌వుతోంద‌ని చెప్పారు. ఎన్నో అవ‌రోధాల‌ను అధిగ‌మించి రాష్ట్రం ప్ర‌గ‌తి ప‌థ‌కంలో వెళ్తుంద‌ని చెప్పారు. రాష్ట్రం బ‌లీయ‌మైన ఆర్థిక శ‌క్తిగా ఎదిగింద‌ని అన్నారు.

ఐటీ, ఇత‌ర రంగాల్లో అనేక కంపెనీల‌ను తెలంగాణ ఆకర్షిస్తోందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆద‌ర్శంగా ఉంద‌ని తెలిపారు. అన్ని రంగాల్లోనూ తెలంగాణ అభివృద్ధి జ‌రిగింద‌ని చెప్పారు. ప్ర‌భుత్వ కృషి వ‌ల్ల 24 గంట‌ల విద్యుత్తు అందుతోంద‌ని చెప్పారు. ప్ర‌తి కుటుంబానికి నల్లా ద్వారా మంచి నీరు అందుతుంద‌ని తెలిపారు.

గ‌తంలో నీటి కోసం గొడ‌వ‌లు జ‌రిగాయ‌ని అన్నారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప్ర‌పంచ దృష్టిని ఆక‌ర్షిస్తోందని అన్నారు. త్వ‌ర‌లోనే కోటి ఎక‌రాల‌కు నీటిని అందిస్తామ‌న్నారు. రైతుల సంక్షేమం కోసం ప్ర‌భుత్వం కృషి చేస్తోందని అన్నారు. ఇప్ప‌టివ‌ర‌కు రైతుల‌కు రూ.65 వేల కోట్లు అందించామ‌ని తెలిపారు.

ధాన్యం ఉత్ప‌త్తి 2.2 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల‌కు పెరిగింది. రైతు బంధు ప‌థ‌కాన్ని ఐక్య‌రాజ్య స‌మితిలోనూ ప్ర‌శంసించార‌ని అన్నారు. రాష్ట్ర జీఎసీడీపీలో 18.2 శాతం వ్య‌వ‌సాయ రంగం నుంచే స‌మ‌కూరుతోందని చెప్పారు. ద‌ళిత బంధు ఓ విప్ల‌వాత్మ‌క ప‌థ‌క‌మ‌ని తెలిపారు. హైద‌రాబాద్ లో బీసీ కులాల కోసం ఆత్మ‌గౌర‌వ భ‌వ‌నాలు నిర్మిస్తున్నామ‌ని తెలిపారు. రంజాన్, క్రిస్మ‌స్ సంద‌ర్భంగా కానుక‌లు అందిస్తున్నామ‌ని అన్నారు. రాష్ట్ర త‌ల‌స‌రి ఆదాయం రూ.3,17,115కు పెరిగింద‌ని చెప్పారు.

Pawan Kalyan : సిగ్గుతో చచ్చిపోయా.. వదినకి కాల్ చేసి ఇదే లాస్ట్ సినిమా అని చెప్పాను..