Sonu Sood: సోనూసూద్‌ నివాసంలో మూడో రోజు ఐటీ సోదాలు!

ప్రముఖ సినీనటుడు సోనూసూద్ ఆస్తులపై ఐటీ సోదాలు జరుగుతున్నాయి. వరుసగా మూడో రోజు సోనూసూద్ నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు ఆదాయపు పన్ను అధికారులు.

10TV Telugu News

Sonu Sood: ప్రముఖ సినీనటుడు సోనూసూద్ ఆస్తులపై ఐటీ సోదాలు జరుగుతున్నాయి. వరుసగా మూడో రోజు సోనూసూద్ నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు ఆదాయపు పన్ను అధికారులు. ముంబైలోని ఆయన నివాసంతో సహా నాగ్పూర్, జైపుర్లలో ఒకే సమయంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. సోనూసూద్ ఆర్థిక లావాదేవీలను కూడా ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ సోదాల్లో భారీ మొత్తంలో పన్ను ఎగవేతను గుర్తించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సోనూ వ్యక్తిగత ఆదాయంలో పన్ను ఎగవేతను ఐటీ అధికారులు గుర్తించినట్లు సమాచారం. సూద్ ఛారిటీ ఫౌండేషన్ బ్యాంకు అకౌంట్లను కూడా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. సోనూసూద్ ఆస్తులపై దాడులకు సంబంధించి ఐటీ అధికారులు మీడియా సమావేశంలో వెల్లడించే అవకాశం ఉంది.
Rohit Sharma: వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్‌గా కూడా రోహిత్ శర్మ?

పన్ను ఎగవేతకు సంబంధించి ఒక కేసు దర్యాప్తులో ముంబై, లక్నో నగరాల్లో ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. సోనూసూద్ కు చెందిన ఆరు ప్రాంతాల్లో ఇప్పటికే ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. లక్నోలోని ఒక స్థిరాస్తి సంస్థతో సూద్ ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిసింది. అందులో పన్ను ఎగవేత అనుమానాలు ఉన్నాయని, అందుకే సోదాలు జరుపుతున్నామని ఐటీ అధికారి ఒకరు వెల్లడించారు. ఇదివరకే సూద్ ఇంట్లో సోదాలు జరిపిన అధికారులు మరోసారి నివాసానికి వెళ్లి సోదాలు జరిపారు.

కొన్ని రోజుల క్రితమే సోనూసూద్ ఆప్ ప్రభుత్వం ప్రారంభించిన ఓ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేజ్రీవాల్‌ను కూడా కలిశారు. ఈ నేపథ్యంలోనే సోనూసూద్ ఇంట్లో ఐటీ సోదాలు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. సోనూ నివాసం, ఆఫీసుల్లో ఐటీ దాడులు జరగడంపై ప్రతిపక్షాలు ఖండిస్తున్నాయి. కరోనా సమయంలో వలస కూలీలు, చాలామందికి ఆరోగ్యపరంగా ఎంతో సాయం చేసిన వ్యక్తిపై కుట్రపూరితంగా ఈ సోదాలు జరుపుతున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Raju : రాజు నేరచరితుడే.. ఎల్బీనగర్ లో చోరీకి యత్నం