Priyanka Jawalkar : ‘టాక్సీవాలా’ హీరోయిన్‌కి కోవిడ్..

తెలుగు యాక్ట్రెస్ ప్రియాంక జవాల్కర్‌కి కోవిడ్ పాజిటివ్..

Priyanka Jawalkar : ‘టాక్సీవాలా’ హీరోయిన్‌కి కోవిడ్..

Priyanka Jawalkar

Updated On : January 19, 2022 / 6:51 PM IST

Priyanka Jawalkar: ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్‌తో కరోనా మహమ్మారి సృష్టించిన విధ్వంసం గురించి పూర్తిగా మర్చిపోకముందే ఇప్పుడు థర్డ్ వేవ్ ప్రపంచాన్ని వణికించేస్తోంది. వైరస్‌కి సామాన్యులు, సెలబ్రిటీ అనే తేడా తెలియదు కదా.. సో, ఇప్పటికే ఎంతోమంది థర్డ్ వేవ్‌లో కరోనా బారినపడ్డారు.

Jr NTR : ‘మావయ్య గారు’ అంటూ తారక్ ట్వీట్..

రీసెంట్‌గా బ్యూటిఫుల్ తెలుగు యాక్ట్రెస్ ప్రియాంక జవాల్కర్‌కి కూడా కోవిడ్ సోకింది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా షేర్ చేశారామె. స్వల్ప లక్షణాలుండడంతో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని తేలిందని.. ప్రస్తుతం డాక్టర్ల సలహాలు పాటిస్తూ ఐసోలేషన్‌లో ఉన్నానని.. ఇటీవల కాలంలో తనను కలిసిన వాళ్లంతా టెస్టులు చేయించుకోవాలని.. అందరూ తప్పకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని ఆమె పోస్టులో పేర్కొన్నారు.

Mahesh Babu : మహేష్ బాబుకి కరోనా నెగెటివ్

రౌడీ హీరో విజయ్ దేవరకొండ ‘టాక్సీవాలా’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది తెలుగమ్మాయి ప్రియాంక జవాల్కర్. సత్యదేవ్‌తో ‘తిమ్మరుసు’, కిరణ్ అబ్బవరం పక్కన ‘SR కళ్యాణమండపం’, ‘గమనం’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుందామె.

Priyanka Jawalkar Instagram