Gone Prakash Rao: తెలంగాణ ప్రభుత్వంపై గోనె ప్రకాశరావు ఫైర్.. పట్టించుకోవడం లేదని..

లంగాణ భవన్ లో వసతుల లేమిపై అధికారులు, ప్రభుత్వంలో ఉన్న వారు పట్టించుకోవడం లేదని గోనె ప్రకాశరావు ఆరోపించారు.

Gone Prakash Rao: తెలంగాణ ప్రభుత్వంపై గోనె ప్రకాశరావు ఫైర్.. పట్టించుకోవడం లేదని..

Gone Prakash Rao: తెలంగాణ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు మరోసారి ఫైర్ అయ్యారు. దేశరాజధాని ఢిల్లీలో ఉన్న తెలంగాణ భవన్ లో వసతుల లేమిపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీ తెలంగాణ భవన్ లో సరైన వసతులు లేవని, పశువుల కొట్టం కంటే అధ్వాన్నంగా అక్కడి గదులు ఉన్నాయని మండిపడ్డారు. తెలంగాణ భవన్ రూముల కంటే, ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సులభ్ కాంప్లెక్స్ లు శుభ్రంగా ఉన్నాయని అన్నారు.

ఇద్దరు వ్యక్తులకు రోజుకి ఆరు వేల రూపాయలు చార్జ్ చేస్తున్నారని.. అయినా సౌకర్యాలు సరిగ్గాలేవని తెలిపారు. ఢిల్లీ తెలంగాణ భవన్ (Telangana Bhavan) లో లిఫ్ట్ పనిచేయడం లేదని. తాగునీటి సౌకర్యం లేదని చెప్పారు. తెలంగాణ భవన్ లో వసతుల లేమిపై అధికారులు, ప్రభుత్వంలో ఉన్న వారు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. హైదరాబాద్ వెళ్లిన తర్వాత ముఖ్యమంత్రిని కలసి తెలంగాణ భవన్ లో సమస్యలపై వివరిస్తానని అన్నారు. ఢిల్లీలో ఏ రాష్ట్ర భవనల్లోనూ కూడా ఇలాంటి పరిస్థితులు లేవని పేర్కొన్నారు.

తెలంగాణ భవన్ లో శుభ్రత, సౌకర్యాల కోసం చర్యలు తీసుకోవాలని గోనె ప్రకాశరావు డిమాండ్ చేశారు. జూన్ 30 లోపు చర్యలు తీసుకోకపోతే తానే మరుగుదొడ్లు శుభ్రం చేయించి, కూలర్లు పెట్టిస్తానని ప్రకటించారు. స్వచ్ఛంద సంస్థలతో కలిసి తెలంగాణ భవన్ లో క్లీన్ డ్రైవ్ చేపడతానన్నారు.

Also Read: ఏపీలో టీడీపీ, జనసేన కలిస్తే 150 సీట్లు పక్కా.. లేకపోతే 100 సీట్లు

స్పందించిన రెసిడెంట్ కమిషనర్
గోనె ప్రకాశరావు ఆరోపణలపై తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ (Resident Commissioner) స్పందించారు. గోదావరి బ్లాక్‌లో ఏర్పాటు చేసిన లిఫ్టులు పాతవి కాగా, త్వరలో కొత్త లిఫ్టులు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. గెస్ట్ హౌస్ గదుల సాధారణ నిర్వహణను అంతర్గత బృందం చూసుకుంటుందని, ఉమ్మడి ప్రాంతాలు రెండు భవన్‌లచే నిర్వహించబడుతున్నాయని వెల్లడించారు. ఎప్పటికప్పుడు జీఏడీ సూచనల మేరకు వివిధ కేటగిరీల కింద అతిథులకు వసతి కల్పిస్తున్నారని ఒక ప్రకటనలో తెలిపారు.

Also Read: ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారంటూ ప్రియాంకాగాంధీ తెలంగాణ టూర్‌పై కేటీఆర్ సెటైర్లు