KCR Maharashtra Tour Live Updates: మార్పు రావాలి.. కేసీఆర్, ఉద్ధవ్ ఠాక్రే జాయింట్ ప్రెస్‌మీట్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ముంబై చేరుకున్నారు. మహా సీఎం ఉద్ధవ్ తో సమావేశమయ్యారు.

KCR Maharashtra Tour Live Updates: మార్పు రావాలి.. కేసీఆర్, ఉద్ధవ్ ఠాక్రే జాయింట్ ప్రెస్‌మీట్

Kcr Maharashtra Tour

KCR Maharashtra Tour Live Updates: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. జాతీయ రాజకీయాల దిశగా మరో కీలక అడుగు వేశారు. మహారాష్ట్రలో పర్యటిస్తున్న ఆయన.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశమయ్యారు. సాయంత్రం ఎన్సీపీ అధినేత, సీనియర్ రాజకీయ నాయకుడు శరద్ పవార్ తో కీలక సమావేశం చేయనున్నారు. జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటు దిశగా.. ఈ సమావేశాలు కీలకం కానున్నాయి. ఇప్పటికే బీజేపీ నేతలు, ఆ పార్టీ రాజకీయాలపై విరుచుకుపడుతున్న కేసీఆర్ కు.. తమిళనాడు సీఎం స్టాలిన్, బెంగాల్ సీఎం మమత వంటి నేతల నుంచి అనూహ్య మద్దతు లభించింది. ఈ క్రమంలో.. కేసీఆర్ కీలక సమావేశాలపై.. దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.